ఆంధ్రప్రదేశ్‌

వెంకయ్య సన్మానానికి మనమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్యనాయుడుకు జరుగుతున్న సన్మాన కార్యక్రమాలకు తమ నేతలు హాజరవడంపై తెదేపా ప్రజాప్రతినిధుల్లో ఆక్షేపణ వ్యక్తమవుతోంది. మంగళవారం నుంచి కేఎల్ యూనివర్శిటీలో ప్రారంభమైన తెదేపా వర్క్‌షాప్‌లో జరిగిన చర్చల్లో మాట్లాడిన పలువురు ఎమ్మెల్యే, ఎంపి, నియోజకవర్గ ఇంచార్జిలు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.
హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇచ్చిన వైనంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, దాన్ని తొలగించాల్సిన బాధ్యత తమ పార్టీపైనే ఉందని పలువురు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. హోదా కంటే ప్యాకేజీ వల్ల లాభమన్న అభిప్రాయం చదువుకున్న వారిలో ఉన్నప్పటికీ, సామాన్య జనంలో మాత్రం హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందన్న అభిప్రాయం ఉందన్నారు.
దీనిని అధిగమించాలని, లేకపోతే ఇప్పటికే జగన్ సద్వినియోగం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్యాకేజీ వల్ల వచ్చే లాభాలను తమ పార్టీనేతలే ప్రచారం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో ప్యాకేజీ సాధించినందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు జరుగుతున్న సన్మానసభల్లో, తమ పార్టీ నేతలు పాల్గొనడాన్ని చాలామంది ప్రజాప్రతినిధులు తప్పుపట్టారు. ‘ప్యాకేజీ సాధించినందుకు వెంకయ్యనాయుడికి జరుగుతున్న సన్మానసభల్లో మన పార్టీ వాళ్లు పాల్గొంటున్నట్లు మీడియాలో చూస్తున్నాం. దానివల్ల పార్టీకి వచ్చేదేమీలేదు. పైగా బిజెపి హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇచ్చి సరిపెట్టారన్న అసంతృప్తి జనంలో ఉంది. అలాంటప్పుడు మన పార్టీ నేతలు ఆ సన్మాన సభల్లో పాల్గొంటే దాని ప్రభావం మనపైన ఉండదా?’ పలువురు అన్నారు.
కాగా, వచ్చే ఎన్నికల్లోగా అమరావతిలో ఐకాన్ టవర్ నిర్మించాలని వర్లరామయ్య సూచించినట్లు తెలిసింది. దానిని చూపించి వచ్చే ఎన్నికలకు వెళ్లడం ద్వారా తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తేనే అమరావతి అభివృద్ధి జరుగుతుందన్న సంకేతాలివ్వాలని సూచించినట్లు తెలిసింది.
హోదా కోసం మన పార్టీ చివరి వరకూ పోరాడింది. కానీ అది జనంలోకి వెళ్లడం లేదు. కేంద్రం హోదా ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్యాకేజీ ఇస్తామంటే తీసుకున్నాం. అది కూడా వద్దంటే కొత్త రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ‘మన వాదన చదువుకున్న వారిని ఒప్పించేలా ఉంది కానీ మిగిలిన వారికి చేరాలంటే విస్తృత ప్రచారం అవసరం. ఇప్పుడు జనం హోదాను మర్చిపోతున్నారు. కానీ వైకాపా, కాంగ్రెస్ దానిని గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ను జనం పట్టించుకోరు. కానీ జగన్ చెప్పేది వింటారు కదా? అందుకే మనం గ్రామస్థాయి నుంచి ప్యాకేజీ వల్ల లాభాలు, హోదాపై వాస్తవ పరిస్థితిని ప్రచారం చేయాలి. జగన్ కుట్రబుద్ధిని కూడా మనం చెప్పాలి. వాస్తవాలు చెబితే ప్రజలు నమ్ముతార’ని మరికొందరు ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.