రాష్ట్రీయం

నేటి నుంచి ఈసీల జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల 24 వ జాతీయ సదస్సు బుధవారం నుండి హైదరాబాద్ (ఐటిసి కాకతీయ, బేగంపేట) లో నిర్వహిస్తున్నారు. 29 రాష్ట్రాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఎన్నికల నిర్వహణకలో కీలకపాత్ర పోషించే ఎన్నికల కమిషనర్ల సమావేశంలో ముఖ్యమైన అంశాలపై రెండు రోజులపాటు చర్చలు జరుగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఏర్పాట్లను తెలంగాణ, ఎపి రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారి భన్వర్‌లాల్ పర్యవేక్షిస్తున్నారు. హాజరవుతున్న అతిథులకు ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌లతో పాటు ప్రధాన హోటళ్లలో బసకల్పిస్తున్నారు. ఒక్కో రాష్ట్ర అధికారికి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని సమకూరుస్తున్నారు. అన్ని రాష్ట్రాలతో సదస్సు జరిగే ప్రాంతంలో ఫోన్లద్వారా మాట్లాడేందుకు ‘హాట్‌లైన్ల’ను ఏర్పాటు చేస్తున్నారు.