రాష్ట్రీయం

ఆంధ్రకు మైక్రోసాఫ్ట్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: విద్య, వ్యవసాయం, పౌరసేవా సదుపాయాల విభాగాల్లో మెరుగైన అభివృద్ధి సాధనకు మైక్రోసాఫ్ట్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల, ఆంధ్ర సిఎం చంద్రబాబు సోమవారం హైదరాబాద్‌లో భేటీకానున్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఆంధ్రకు పిఓసి (ప్రూఫ్ ఆఫ్ కానె్సప్ట్) ప్రకారం సాంకేతికంగా సహకరించనున్నట్టు తెలిపింది. ఆంధ్రకు క్లౌడ్ టెక్నాలజీ సహకారం అందించేందుకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. వ్యవసాయం, విద్య, పౌరసేవా రంగాల్లో మరింత సమర్ధంగా పనిచేయడానికి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, ఎగ్జిక్యూటివ్‌లకు క్లౌడ్ టెక్నాలజీ, మరికొన్ని అంశాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. వ్యవసాయంలో ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు వేయవచ్చనే అంశాన్ని ముందుగా తెలుసుకుని మెరుగైన ఉత్పాదకత సాధించేందుకు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ తోడ్పడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అలాగే మైక్రోసాఫ్ట్ అందించే ‘అజూర్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ అండ్ పవర్ బీఐ’ ద్వారా పాఠశాలల్లో డ్రాపవుట్లకు తగిన పరిష్కారాలతో చెక్ పెట్టవచ్చునని తెలిపింది. సిఎం చంద్రబాబు, సత్య నాదెళ్ల సమావేశంలో మరిన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ టి హబ్ సందర్శన
మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల సోమవారం హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి హబ్‌ను సందర్శించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. టి.హబ్‌లో వందకుపైగా ఉన్న స్టార్టప్స్ వారితో సత్య మాట్లాడతారని తెలిపింది. దాదాపు గంటకుపైగా ఆయన టి.హబ్‌లో ఉన్న వ్యాపారవేత్తలతో ప్రసంగిస్తారని పేర్కొంది. సత్య నాదెళ్ల వెంట తెలంగాణ ఐటి మంత్రి కె.తారకరామారావు ఉంటారు. టి.హబ్ అనేది దేశంలోనే అతిపెద్ద ఇన్‌క్యుబేటర్‌గా ఏర్పాటైందని, దాన్ని సత్య సందర్శించడం అరుదైన అవకాశంగా ప్రభుత్వం భావించి ఆయన పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సత్య నాదెళ్ల తన పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసే అవకాశముందని తెలుస్తోంది.