రాష్ట్రీయం

ఉగ్రరూపం దాల్చిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల మూలంగా గోదావరి, దాని ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని గోదావరికి ఉపనదిగా ఉన్న మంజీర చాలా సంవత్సరాల తర్వాత వరదతో నిండిపోతోంది. ఇప్పటికే ఈ నదిపై ఉన్న సింగూరు, మంజీరా, ఘన్‌పూర్ ఆనకట్ట, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టులు గత 15 రోజుల నుండి అలుగులు పారుతున్నాయి. గురువారం అందిన సమాచారం ప్రకారం సింగూరు ప్రాజెక్టులోకి 65 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 59 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. అలాగే సింగూరు దిగువన ఉన్న నిజాంసాగర్‌లోకి 55 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 51 వేల క్యూసెక్కులు కిందకు వదిలివేస్తున్నారు. నిజాంసాగర్‌తో పాటు మహారాష్ట్ర నుండి వస్తున్న భారీ వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పి) కళకళలాడుతోంది. ఇప్పటికే ఎస్‌ఆర్‌ఎస్‌పి నుండి అదనపు జలాలను కిందకు వదివేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఎస్‌ఆర్‌ఎస్‌పిలోకి 82 వేల క్యూసెక్కుల వరద జలం వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వదిలివేస్తున్నారు. గోదావరిపైనే ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1,57,688 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1,66,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి పొంగిపొర్లుతోంది. భద్రాచలం వద్ద నదిలో స్నానం చేసే భక్తుల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఇలా ఉండగా గోదావరిపై ఉన్న ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 4,34,444 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 10,800 క్యూసెక్కులు డెల్టాకాలువల్లోకి వదిలివేస్తూ 4,38,658 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు.
కర్నాటకలో కురిసిన వర్షాల వల్ల కృష్ణానదిపై ఉన్న జూరాలలోకి 33 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 42 వేల క్యూసెక్కులను దిగువకు వదిలివేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం నిండింది. తాజా సమాచారం ప్రకారం 215 టిఎంసిల సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో 204 టిఎంసిల నీరు నిలువ ఉంది. దాంతో ఈ ప్రాజెక్టులోకి వస్తున్న 35 వేల క్యూసెక్కుల నీటిలో 29 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి అదనపు నీటిని వదిలివేస్తుండటంతో నాగార్జునసాగర్ జలాశయంలోకి 21 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక 312 టిఎంసిల నిలువనీటి సామర్థ్యం ఉన్న నాగార్జునసాగర్ ఎప్పుడు నిండుతుందా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.