రాష్ట్రీయం

పిడుగునూ పట్టేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 6: వరదలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏటా రాష్ట్రంలో వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఎవరికీ తెలియని విషయమేమంటే...పిడుగుపాటుకు మరణిస్తున్నవారి సంఖ్యా అధికంగానే ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఏటా పిడుగుపాటుకు 2,500మంది కన్నుమూస్తున్నట్టు అంచనా. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామిగా ఉన్న ఇస్రో, వాతావరణ పరిస్థితులను ముందుగా పసిగట్టే అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉపగ్రహాలు అందించే సమాచారాన్ని విశే్లషించి ఉరుములు, పిడుగులు ఎక్కడ పడతాయో ముందుగానే తెలుసుకునే పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంది. ఈ మేరకు పిడుగుపాటు మరణాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఇస్రో సహాయాన్ని తీసుకోబోతోం ది. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపేటప్పుడు వాతావరణ పరిస్థితులతోపాటు ఉరుములు, పిడుగుల రాకను కూడా ఇస్రో నిమిష నిమిషానికీ తెలుసుకుంటుంది. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు ఇస్రో ముందుకు వచ్చింది. ఇస్రో అందించే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న యూనివర్శిటీలు అందిపుచ్చుకుంటాయి. ఇందుకోసం ప్రతి వర్శిటీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనించే ఈ విభాగం, పిడుగులు పడే సమయాలను ముందగానే తెలుసుకుంటారు. ఏ ప్రాంతంలో, ఏ సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందో ముందుగానే తెలుసుకుంటారు. వెంటనే ఈ విభాగం సంబంధిత ప్రాంతంలోని వ్యక్తులకు సెల్‌ఫోన్‌ల ద్వారా మెసేజ్ పంపిస్తుంది. జిల్లాలోని సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లతో ఈ విభాగం ముంగానే అనుసంధానమై ఉండడంతో మెసేజ్‌లు క్షణాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లిపోతాయి. దీంతో అక్కడి ప్రజలు అప్రమత్తమవుతారు.
వర్షపాతంపైనా
ముందుగానే సమాచారం
ఇదిలాఉండగా వచ్చే ఏడాది రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో వర్షపాతం ఏవిధంగా ఉంటుందో ముందుగానే సమాచారం ఇస్తారు. వర్షాభావ ప్రాంతాలను ముందుగానే తెలుసుకోవడం వలన అక్కడ చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం ముందుగానే పరిశీలించగలుగుతుంది. ప్రస్తుతం వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారం అంతంతమాత్రంగా ఉంటోంది. వాతావరణ పరిస్థితులు తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వినియోగించే యంత్రాలను మరిన్ని రాష్ట్రంలో నెలకొల్పేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనివలన వర్షం రాకపోకలను నిక్కచ్చిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీటిన్నింటికి సంబంధించి ఈనెల 10న విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు.