రాష్ట్రీయం

నిస్పృహతోనే రోహిత్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రీసర్చి విద్యార్ధి రోహిత్ వేముల కేవలం నిరాశ, నిస్పృహతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని జస్టిస్ రూపన్‌వాలా కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. రోహిత్ వేముల ఆత్మహత్యతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రూపన్‌వాలా కమిషన్‌ను గత జనవరి 28న నియమించింది. కమిషన్ తన 41 పేజీల నివేదికను ఆగస్టు 1వ తేదీనే సమర్పించినా కమిషన్ నివేదిక అంశాలు నేడు వెలుగు చూశాయి. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరి ఒత్తిడి లేదని, ఇటు విశ్వవిద్యాలయం ఒత్తిడి లేదా రాజకీయ నాయకుల ఒత్తిడి లేదని కేవలం వ్యక్తిగత నిరాశ, నిస్పృహలతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నివేదికలో రెండు కీలక అంశాలను కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. రోహిత్ షెడ్యూల్డు కులాలకు చెందిన వారనేది నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు.
రోహిత్ వేముల తల్లి రాధిక ఎస్సీకి చెందిన వారేననేది కూడా నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. మరో కీలక ప్రస్తావనలో న్యాయమూర్తి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీకి, బండారు దత్తాత్రేయకు క్లీన్‌చిట్ ఇచ్చారు. వీరి ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే రూపన్‌వాలా నివేదికను కొన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతూ ఆ నివేదికను తాము తోసిపుచ్చుతున్నట్టు పేర్కొన్నాయి. సిపిఎం పోలిట్‌బ్యూరో సైతం ఒక ప్రకటనలో రూపన్‌వాలా నివేదికను తిరస్కరించాలని, విసిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయని ఆరోపించింది.