రాష్ట్రీయం

సింగరేణికి దసరా కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6:సింగరేణి కాలరీస్‌కు వచ్చిన లాభాల్లో కార్మికులకు 23 శాతం వాటా చెల్లించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అలాగే పదవీ విరమణ (విఆర్‌ఎస్) పథకం కింద లబ్ధిపొందని ఉద్యోగుల కుటుంబాలకు డెపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి బొగ్గుగని కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎంపి కవిత ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ విస్తరించిన ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సిఎండి శ్రీ్ధర్ గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి సాధిస్తున్న ప్రగతిని ముఖ్యమంత్రి అభినందిస్తూ, కార్మికుల కృషికి నజరానాగా దీపావళికి ప్రతి కార్మికునికి రూ. 54 వేల చొప్పున బోనస్ చెల్లించాలని ఆదేశించారు. కంపెనీ లాభాల్లో చెల్లించే వాటా, బోనస్ కలిపి ఒక్కో కార్మికుడు ఈ నెలలో రూ.97 వేలు వరకూ అందుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు.
సింగరేణి సంస్థ 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ.1066.13కోట్ల నికర ఆదాయాన్ని గడించగా, ఇందులో 23 శాతం వాటా కింద కార్మికులకు రూ. 245 కోట్లు పొందుతారని కెసిఆర్ అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో కార్మికులకు వాటా కేటాయించడం కంపెనీ చరిత్రలో ఇదే ప్రథమం. గత ఏడాది 21 శాతం వాటా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రికార్డు స్థాయిలో 60.38 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిందన్నారు. దీనిద్వారా రూ. 1313 కోట్ల స్థూల ఆదాయం, రూ. 1066 కోట్ల నికర ఆదాయం పొందిందని సిఎం అభినందించారు.