రాష్ట్రీయం

పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, అక్టోబర్ 8: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపైనున్న పంతంగిటోల్ ప్లాజా వద్ద శనివారం వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దసరా పండుగ వాతావరణం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారి వైపు గ్రామాలకు దసరా పండుగకోసం ప్రజలంతా వాహనాలలో తరలివెళ్తున్నారు. టోల్‌ప్లాజా వద్ద ఒక్కసారిగా ఏర్పడ్డ వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడానికి చౌటుప్పల్ పోలీసులు, జిఎమ్మార్ సంస్థ సెక్యూరిటీ సిబ్బంది నానాయాతనలు పడుతున్నారు. ప్రయాణికులు తమ ద్విచక్రవాహనాలతో పాటు, కార్లు, ఆటోలు బస్సులు, ప్రైవేటు వాహనాలలో కిక్కిరిసి వెళ్తున్నారు. వరుసబెట్టి వాహనాలు వెళ్తుండడంతో కాలినడక ప్రయాణికులు రోడ్డును దాటడం కష్టంగా మారింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద నున్న 16 గేట్‌వేలలో 10 గేట్‌వేలను విజయవాడ వైపు తెరిచి వాహనాలను వదులుతున్నారు. ఉదయం నుంచి వేలాదిగా వాహనాలు వస్తుండటంతో టోల్‌ప్లాజా వద్ద రద్ధీ భారీగా పెరిగిపోయింది. దీనితో వాహనాలను క్రమబద్ధీకరించడానికి చౌటుప్పల్ పోలీసులు, జిఎమ్మార్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ రహదారిపై వస్తున్న వాహనాలకోసం టోల్‌ప్లాజా వద్ద రోజువారీగా రెండువైపులా నాలుగేసి గేట్లు మాత్రమే వాడుకునేవారు. దసరా పండుగ సెలవులు ఇవ్వడంతో శనివారం వాహనాలను వదలడంకోసం 16 గేట్లను వాడుకున్నారు. ఉదయం 6 గంటల వరకు వర్షం కురియడంతో అప్పటివరకు ఆగిపోయిన ప్రయాణికులంతా ఒక్కసారిగా బయలుదేరడంతో రోడ్డు పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. ఉదయం 10 గంటల సమయంలో టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరగడంతో విజయవాడ వైపే 10 గేట్లను తెరిచి వాహనాలను వదిలేస్తున్నారు. ప్రతిరోజు సగటున 17 వేల వాహనాలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తుంటాయి. కానీ శనివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకే 24 వేల వాహనాలు వెళ్లినట్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద నున్న జిఎమ్మార్ సంస్థ ఉద్యోగులు వివరించారు. మళ్ళీ రాత్రి 12 గంటల వరకు 30 వేలు వాహనాల వరకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. మరో రెండు రోజుల వరకు ఇదేవిధంగా వాహనాలు రద్దీ కొనసాగవచ్చునని వివరిస్తున్నారు.

చిత్రం.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద బారులుతీరిన వాహనాలు