రాష్ట్రీయం

కృష్ణా జలాలపై వీడనున్న పీటముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: కృష్ణా జలాల పంపిణీని తిరిగి నాలుగు రాష్ట్రాలకు చేయాలా, లేక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేయాలా? అనే అంశంపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ నెల 19వ తేదీన కీలకమైన తీర్పు ఇవ్వనుంది. ఈ విషయాన్ని ట్రిబ్యునల్ కార్యాలయం రెండు రాష్ట్రాలకు తెలియచేసింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నాలుగు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలంటూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించాయి. ఏపి పునర్విభజన చట్టంలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల అంశాన్ని ప్రస్తావించారని, నాలుగు రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే తప్ప చట్టంలోని అంశాలు అమలు కావని రెండు తెలుగు రాష్ట్రాలు ట్రిబ్యునల్‌ను కోరాయి. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమని, మొదట కేటాయించిన నీటి పంపిణీకి లోబడి ఈ రెండు రాష్ట్రాలకు జలాలను సర్దాలని మహారాష్ట్ర, కర్నాటక ట్రిబ్యునల్ ఎదుట వాదించాయి. కేంద్రం కూడా రెండు రాష్ట్రాలకే నీటి కేటాయింపులను చేయాలని ట్రిబ్యునల్‌కు లిఖితపూర్వకంగా పిటిషన్ ఇచ్చింది. గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 800 టిఎంసి, కర్నాటకకు 700 టిఎంసి, మహారాష్టక్రు 500 టిఎంసి జలాలను కేటాయించింది. ఆ తర్వాత కేంద్రం 2010లో ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముసాయిదాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1001 టిఎంసి, కర్నాటకకు 911 టిఎంసి, మహారాష్టక్రు 660 టిఎంసి నీటిని కేటాయించింది.