రాష్ట్రీయం

నకిలీ నక్సలైట్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గచ్చిబౌలి, అక్టోబర్ 8: గ్యాంగ్‌స్టర్ నరుూం పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ నక్సలైట్లను స్పెషల్ ఆపరేషన్ టీమ్, జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నరుూం ఎన్‌కౌంటర్ తరువాత నగరశివారులో బెదిరింపులకు పాల్పడుతున్న బొల్లా నర్సింహ, పల్లెల సురేందర్, రాచకొండ శ్రీరాములు, అక్కరం కృష్ణ, సమ్మయ్యలను రాచకొండ ఎస్‌వోటి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక బొమ్మ తుపాకి, కారు, ఐదు మొబైల్ ఫోన్లు, రూ. 3.95 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
గత మూడు సంవత్సరాల నుండి వివిధ ప్రాంతాలలో చాలామందిని భయపెట్టారని ఇంతవరకు వారికి భయపడి ఫిర్యాదు చేయని బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ ఎం భగవత్ తెలిపారు. వీరు గత నెల 14న జవహర్‌నగర్‌లోని ఆదిత్య అసుపత్రికి ఫోన్ చేసి తాము మావోయిస్టులమని, రూ. 50 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు సమ్మయ్య పరారీలో ఉండగా, నర్సింహులు, సురేందర్, శ్రీరాములు కృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారించగా 9 కేసుల్లో బెదిరింపులకు పాల్పడినట్టు ఒప్పకున్నారని కమిషనర్ తెలిపారు. 2016లో జవహర్‌నగర్‌లోని దుమ్మాయిగుడెంకు చెందిన బాలమల్లేష్‌ను బెదిరించి లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్పారు. మెదక్ జిల్లాలోని జగ్‌దేవ్‌పూర్‌కు చెందిన పెద్ది శ్రీనివాస్‌ను బెదిరించి రూ. 75వేలు, 2015లో నరుూం అనుచరులమని అదే గ్రామంలో రవికంటి శ్రీనివాస్ నుంచి రూ. 50వేలు వసూలు చేశారు. అలాగే బుద్ద రమేష్‌ను భయపెట్టారు. కుషాయిగూడకు చెందిన రేకంటి మూర్తిని బెదిరించి 8లక్షల 83వేలు వసూలు చేశారని సిపి తెలిపారు. 2016లో జవహర్‌నగర్ పియస్ పరిధిలో కల్యాణ్ చక్రవర్తిని కిడ్నాప్ చేసి, బెదిరించి రూ. 6 లక్షలు, తుర్కపల్లికి చెందిన అంబటి చిన్నకృష్ణను బెదిరించి రూ. 2 లక్షలు వసూలు చేశారని చెప్పారు.
ఇబ్రహీంపట్నం పేలుళ్లకు కారణాన్ని గుర్తించాం
ఇటీవల ఇబ్రహీంపట్నంలో జరిగిన వరుస పేలుళ్లకు కారణాలను గుర్తించామని భగవత్ తెలిపారు. కిందపడిన రసాయనంపై ఒత్తిడి వల్లే పేలుళ్లు జరిగాయని కమిషనర్ వెల్లడించారు. రసాయనాలు తయారు చేస్తున్న నందగోపాల్‌ను అరెస్టు చేశామని, కేసు దర్యాప్తులో ఉందని కమిషనర్ వివరించారు.

చిత్రం.. నకిలీ నక్సలైట్ల వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ కమిషనర్ ఎంఎం భగవత్