రాష్ట్రీయం

హనుమంత వాహనంపై ఊరేగిన మలయప్పస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 8: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల నడుమ శ్రీనివాసుడు శ్రీరాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. హనుమంతుడు భగవత్ భక్తులతో అగ్రగణ్యుడు, చతుర్వేద నిష్ణాతుడుగా, నవ వ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మాపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనంద పరవశులను చేసింది.
నూతన స్వర్ణరథంపై విహారం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు రథరంగ డోలోత్సవం కన్నుల పండువగా జరుగింది. శ్రీనివాసుడు ధగధగా మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమయమైన రథంలో శ్రీ్భదేవేరులతో మలయప్ప దర్శనమిచ్చారు.
గజ వాహనంపై శ్రీనివాస ప్రభువు కనువిందు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవరోజు శనివారం రాత్రి 9 నుంచి 11 గంటల నడుమ వేంకటాద్రీశుడు గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. రాజులను పట్ట్భాషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తి ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహణం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి గజవాహనారూఢుడై తిరువీధులలో తిరగడం భక్తులకు మరుపురాని దృశ్యం.

చిత్రాలు..తిరుమల మాడ వీధుల్లో రాత్రి గజవాహనంపై విహరిస్తున్న మలయప్పస్వామి