రాష్ట్రీయం

వచ్చే ఏడాదికి ఎల్‌విఎంకె3 సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 8: వచ్చే ఏడాది తొలి అర్ధ్భాగంలో జియో సింక్రనస్ శాటిలైట్లే లక్ష్యంగా కొత్త లాంచింగ్ వెహికల్ (ఎల్‌విఎంకె3) సిద్ధం కానుంది. పరీక్షల దశ దాటి ప్రయోగాత్మకంగా పరీక్షించే దశకు ఇందుకు సంబంధించిన ఎల్‌విఎంకె3 సిద్ధమైందని ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ బివివిఎస్‌ఎన్ ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ వి.రంగనాథన్ తెలిపారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అంతరిక్షంపై అవగాహన కల్పించేందుకు సమావేశాన్ని, వివిధ పోటీలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానంలో ఈ లాచింగ్ వెహికల్‌ను రూపొందిస్తున్నామన్నారు. ఇందులో రాకెట్‌కు కింద భాగంలో ఇరువైపులా ఎస్200 అనే మోటార్లను అభివృద్ధి చేసి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యలో ఎల్110 అనే మోటారును, పై భాగంగా సి25 అనే క్రయోజనిక్ ఇంజన్‌ను రూపొందించామన్నారు. దీని వల్ల ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను భూమికి 36000 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టేందుకు వీలు అవుతుందన్నారు. ఈ రాకెట్ లాంచ్ వెహికల్ వల్ల కమ్యూనికేషన్లకు ఉపయోగించే ఉపగ్రహాలను జియో సింక్రనస్ కక్ష్యలో ఉంచేందుకు వీలు అవుతుందన్నారు. వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో డెవలప్‌మెంటల్ ఫ్లైట్-1 పేరుతో ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు డిమాండ్ ఎక్కువగా ఉంటోందని, రాకెట్ సిద్ధమైన వెంటనే అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉపగ్రహాలను ఎంపిక చేస్తామన్నారు. అమెరికా తదితర దేశాలతో పోలిస్తే, భారత్‌లో అంతరిక్ష పరిశోధనలకు కేటాయించే నిధులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ గత అనుభవాలను, విజ్ఞానాన్ని ఉపయోగించుకుని విజయాలను నమోదు చేస్తున్నామన్నారు. ఎల్‌ఎంకె3 లాంచింగ్ వెహికల్‌లో ఉపయోగించిన మోటార్లను తాము రెండింటిని తయారు చేసి వివిధ అంశాలపై పరిశోధనలు చేశామన్నారు. ఇతర దేశాల్లో 10 మోటార్లు తయారు చేసి పరీక్షిస్తారని వివరించారు. ఒక్కో మోటారు తయారీకి 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, తమకు ఉన్న పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేస్తున్నామన్నారు. చంద్రయాన్-2కు సంబంధించి ల్యాండ్ రోవర్ తయారీ తుది దశలో ఉందని తెలిపారు.

ఫైల్‌ఫొటో