రాష్ట్రీయం

భార్యా హంతకుడి జీవిత ఖైదును పదేళ్లకు తగ్గిస్తూ హైకోర్టు తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: ఒక వ్యక్తి మద్యం సేవించి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో జిల్లా సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదును పదేళ్ల కఠిన జైలుశిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎం సీతారామమూర్తితో కూడిన హైకోర్టు ధర్మాసనం వెలువరించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గొడుగు భీమయ్య అలియాస్ పులి చిన్న భీమయ్య అనే వ్యక్తి తన భార్య పులి ఈశ్వరమ్మపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కేసులో మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి జీవిత ఖైదు విధిస్తూ 2010లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్ సురేందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో నిందితుడు తన భార్యపైన కిరోసిన్ పోసి నిప్పంటించడం నేరమే అయినప్పటికీ జిల్లా జడ్జి ఐపిసి 302సెక్షన్ కింద కేసు నమోదు చేయడం సరికాదన్నారు.
ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని నిందితుడు నేరానికి పాల్పడే సమయంలో మద్యంసేవించి మత్తులో ఉన్నాడని పేర్కొంది. భార్యపైన కిరోసిన్ పోసి నిప్పంటించే చర్యకు పాల్పడడానికి ముందు భార్యా భర్తల మధ్య ఆవేశంతో వాగ్వాదం జరిగి ఉండవచ్చని హైకోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడు నేరానికి పాల్పడిన సమయంలో మద్యం సేవించి ఉన్నాడన్న కీలకమైన విషయాన్ని జిల్లా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టు పేర్కొంది. అనంతరం కింది కోర్టు నిందితుడు భీమయ్యకు ఐపిసి 302సెక్షన్ కింద విధించిన జీవిత ఖైదును 10 ఏళ్ల కఠిన జైలు శిక్షగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది.