రాష్ట్రీయం

మట్టి పనులతో సరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 8: పోలవరం ప్రాజెక్టులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామంలో చేపట్టిన పవర్ ప్రాజెక్టు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పోలవరం విద్యుత్ కేంద్రం పనులు పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తే నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తవుతాయి. లేదంటే మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టులో విద్యుత్ కేంద్రం భాగమో కాదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. విద్యుత్ కేంద్రం టెండర్లు పూర్తయినప్పటినుంచి కేవలం మట్టి పనితోనే నెట్టుకొస్తున్నారు. దీని నిర్మాణం కోసం గ్రామాన్ని ఖాళీ చేయించి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటికీ పునరావాసం ఊసు లేదు. బాధితులకు భూమికి భూమి అనే విధానమే లేదు. ఇందిరాసాగర్ పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ పథకం పేరుతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. మొత్తం 12 యూనిట్లుగా ప్రాజెక్టు నిర్మించనున్నారు. ఒక్కో యూనిట్ 80 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మించనున్నారు. 2017 మే నాటికి మట్టిపనులు పూర్తిచేసి మార్చి నుంచి అసలు నిర్మాణానికి టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ విద్యుత్ కేంద్రంనుంచి ఉత్పత్తి ప్రారంభమైతే రోజుకు 2.40 లక్షల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని జెన్‌కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వివిఎస్ మూర్తి ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. దీంతో ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుందన్నారు. వాస్తవానికి పోలవరం హెడ్ వర్క్సులో భాగంగా జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అంగుళూరు గ్రామంలో 303 ఎకరాల్లో 1.18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, కొండ తొలగింపు చర్యలు చేపట్టారు. నిబంధనల ప్రకారం ఈ పనులు గత ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. తాజాగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఈ ఏడాది జూలై నాటికి మట్టి పనులు పూర్తి చేయాల్సి వుంది. కొండను 154 మీటర్ల మేర భూ మట్టం వరకు తవ్వి అక్కడ నుంచి మరో ఎనిమిది మీటర్ల లోపలికి వెళ్ళాల్సి ఉంది. జెన్‌కో ఈ పనులు స్వాధీనం చేసుకున్న తర్వాత 9 మీటర్ల వ్యాసార్ధంతో 12 టనె్నల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని ఎల్ అండ్ టి చేపట్టింది. మట్టిపని త్రివేణి, ట్రాన్స్‌ట్రాయ్ తీసుకుంది. రోజుకు 21.2 లక్షల ఘనపు మీటర్ల మట్టి పని లక్ష్యంగా నిర్దేశించారు. దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామంలో గిరిజనుల నుంచి 57 ఎకరాల భూమిని సేకరించారు. ఇప్పటికీ భూమికి భూమి ఇవ్వలేదని గిరిజనులనుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.