ఆంధ్రప్రదేశ్‌

ఎక్కడి పనులు అక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, అక్టోబర్ 8: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శనివారం నుంచి పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ పంచువల్ విధానంతో పనులను పరిశీలిస్తూ పనులు వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజెన్సీ అయిన ట్రాన్స్‌ట్రాయ్ పనులు వేగవంతం చేయడంలేదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి మట్టి తవ్వకం పనులను త్రివేణి ఎర్త్ వర్క్స్ పంపిణీకి పూర్తిగా అప్పగించారు. రెండునెలలుగా వేగంగా జరుగుతున్న పనులకు బ్రేకు పడింది. ఈ నెల 4వ తేదీ నుంచి మూడు ఎస్కలేటర్సు, ఆరు డంపర్లతో పనులు సాగించారు. శనివారం నుంచి ఆ పనులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. త్రివేణి కంపెనీకి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు మాత్రమే చెల్లించాల్సి ఉందని తెలిసింది. అయితే బిల్లులు చెల్లించకపోవడంతో ఫీజులు రాక పనులు నిలిచిపోయినట్టు అంటున్నారు. దీనిపై ఎస్‌ఇ రమేష్‌బాబు వివరణ ఇస్తూ వర్షాల కారణంగా స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోవడంతో పనులకు ఆటంకం కలిగిందని, మోటార్లతో నీటిని తోడిస్తున్నామని, అలాగే డీజిల్ కూడా రోజుకు మూడు ట్యాంకర్లను రప్పిస్తున్నామని, ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో పనులు మొదలవుతాయని తెలిపారు. అయితే మట్టి తవ్వే పనులు త్రివేణి సంస్థకు ప్రభుత్వం అప్పగించడంతో ట్రాన్స్‌ట్రాయ్ ఏజెన్సీ త్రివేణి సంస్థను ఏదోవిధంగా ఇరుకున పెట్టాలన్న ఉద్దేశ్యంతో 25కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో పనులు ఆపినట్టు తెలిసింది. వందలాది కోట్ల రూపాయల విలువగల మిషనరీని నిర్మాణ ప్రాంతంలో ఉంచినప్పటికీ ఇంకా బ్యాంకు గ్యారంటీ ఎందుకని త్రివేణి సంస్థ భావిస్తూ పనులు నిలిపివేసినట్టు తెలిసింది. ఈ సమస్య ప్రభుత్వ రాజకీయ పెద్దలే తీర్చాలని త్రివేణి సంస్థ భావిస్తున్నట్టు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు ఇరిగేషన్ అధికారులు, త్రివేణి, ట్రాన్స్‌ట్రాయ్ సంస్థల జాయింట్ ఎక్కౌంట్‌కు చెల్లిస్తే బాగుంటుందని అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
chitram...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో నిలిచిపోయిన పనులు