రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించామని, హైకోర్టు నుంచి క్లియరెన్సు వచ్చిన వెంటనే వీటి విక్రయాలను ప్రారంభిస్తామని ఏపిసిఐడి చీఫ్ ద్వారకా తిరుమల రావు చెప్పారు. గుంటూరు జిల్లా చిన కాకాని వద్ద హాయ్ ల్యాండ్, కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, కల్లూరు మండలాల్లో ఉన్న భూములు, విజయవాడలో అగ్రిగోల్డ్ కన్‌స్ట్రక్షన్ ఆఫీసు, విశాఖలో బీచ్ రిసార్ట్ తదితర ఆస్తుల వివరాలను సేకరించామన్నారు. తెలంగాణలో 1162ఎకరాల వ్యవసాయ భూమిని మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట, మిర్జిల్, లక్ష్మీపురం, ఊటుకూరు మండలాల్లో గుర్తించామన్నారు. దీంతోపాటు 54 కార్లు, 2.4 కేజీల బంగారు ఆభరణాలు, 8.47 కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హైకోర్టులో ఆస్తులపై ఒక పిల్ పెండింగ్‌లో ఉంది. హైకోర్టు నుంచి క్లియరెన్సు వచ్చిన వెంటనే ఆస్తులను హైకోర్టు ఆదేశాలకు లోబడి ఈ ఆస్తులను వేలం వేస్తామన్నారు. డిపాజిటర్లకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో సిఐడి శాఖ పనిచేస్తోందన్నారు. అగ్రిగోల్డ్‌కు ఆంధ్రాలో 19,43,120 డిపాజిటర్లు, తెలంగాణలో 2,66,944 మంది డిపాజిటర్లు, కర్నాటకలో 8,43,864 మంది, ఒడిశాలో 95,401 మంది, తమిళనాడులో 38,363 మంది, మహారాష్టల్రో 9160 మంది, అండమాన్ నికోబార్ దీవుల్లో 4549 మంది, చత్తీస్‌ఘడ్‌లో 1206 మంది డిపాజిటర్లు ఉన్నారన్నారు. ఆస్తుల విక్రయంపై డిపాజిటర్లకు ఇంతవరకు కర్నూలు, విశాఖపట్నం, విజయవాడలో అవగాహన సదస్సులను సిఐడి నిర్వహించింది. అగ్రిగోల్డ్ రూ.7623 కోట్లను డిపాజిటర్లకు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డిపాజిటర్లకు దాదాపు 3957 కోట్ల రూపాయలను చెల్లించాలి. వివిధ బ్యాంకుల్లో రూ. 537 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని సిఐడి గుర్తించింది.