తెలంగాణ

ఇకపై జిల్లా ఇరిగేషన్ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పడుతున్నందున ప్రభుత్వ శాఖలు జిల్లా అధికారులను నియమిస్తున్నారు. అన్ని శాఖల అధికారులకు సూచన ప్రాయంగా వారికి కేటాయించిన జిల్లాల గురించి వివరించారు. అయితే అధికారికంగా మంగళవారం నాడే ఉత్తర్వులు వెలువడుతాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో 31 జిల్లాలకు జిల్లా ఇరిగేషన్ అధికారులను నియమిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు జిల్లా ఇరిగేషన్ అధికారులుగా ప్రభుత్వం హోదా కల్పించింది. ఆదిలాబాద్ కు ఇఇడి సుశీల్ కుమార్, నిర్మల్-బివి రమణారెడ్డి, మంచిర్యాల-ఎం వేణుగోపాల్‌రావు, కొమురం భీమ్ ఆసిఫాబాద్-జె గుణవంత్‌రావు, కరీంనగర్-టి శ్రీనివాసరావు గుప్తా, జగిత్యాల-సిహెచ్ బుచ్చిరెడ్డి, పెద్దపల్లి-ఎల్ సత్యవర్థన్, సిరిసిల్ల-బి చిరంజీవులు, వరంగల్-ఎ శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్-ఎల్‌వై రత్నం, జనగామ-ఎం రాంప్రసాద్, జయశంకర్ భూపాలపల్లి-కె రవీందర్, ఖమ్మం-సిహెచ్ చిట్టిరావు, భద్రాద్రి కొత్తగూడెం-కె వెంకటేశ్వరరెడ్డి, నిజామాబాద్-పి రాధాకృష్ణరావు, కామారెడ్డి-కె మధుకర్‌రెడ్డి, మెదక్-బి యేసయ్య, సిద్ధిపేట-డి రవీందర్‌రెడ్డి, సంగారెడ్డి-పి రాములు, వికారాబాద్-టి వెంకటేశం, హైదరాబాద్, శంషాబాద్, మల్కాజిగిరి జిల్లాలకు ఎస్ భీమ్‌ప్రసాద్, మహబూబ్‌నగర్-డి నరసింగరావు, నాగర్‌కర్నూలు-బి గోవిందు, వనపర్తి-ఎస్ శ్రీనివాసులు, గద్వాల-కె శ్రవణ్ కుమార్, నల్లగొండ- ఎంఏ హమీద్‌ఖాన్, సూర్యాపేట-ఎస్ సంజీవరెడ్డి, యాదాద్రి-సుధీర్ లను నియమించారు. మంగళవారం వీళ్లు అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు.