రాష్ట్రీయం

డ్రగ్స్ దందాలో దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: ఇటీవల హైదరాబాద్‌లో సంచలనం రేకెత్తించిన డ్రగ్స్ దందాలో కీలక వ్యక్తులు బెంగుళూరులో ఉన్నట్టు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ దందాలో ముగ్గురు నిందితులు కీలకమని, వీరికోసం ఎన్‌సిబి అధికారులతోపాటు పోలీస్ యంత్రాంగం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. నిందితులు బెంగుళూరులో ఉన్నట్టు పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐడిఏ బొల్లారంలో ఖాయిలాపడ్డ పరిశ్రమను లీజుకు తీసుకొని నిషేధిత మత్తుపదార్థాం ఎంఫెట్‌మైన్ తయారుచేస్తున్న గుట్టును ఎన్‌సిబి రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సైంటిస్టు వెంకటరామారావు, ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్‌రెడ్డి, రవిశంకర్‌రావు, ప్రీతిని అధికారులు అరెస్టు చేశారు. రాజశేఖర్‌రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టారు. మాదకద్రవ్యాల రవాణా సూత్రధారులు శ్రీనివాస్‌రెడ్డి, రామ్మూర్తి, ముంబయికి చెందిన నబీద్ కోసం గాలిస్తున్నారు. కాగా వీరు నగరంలో తయారైన ఎంఫెట్‌మైన్‌ను బెంగుళూరుకు తరలించి అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ట్యాబ్లెట్ల రూపంలోకి మార్చడంలో సైంటిస్ట్ వెంకటరామారావు సాయం చేసేవారు. దీనికి అవసరమై పెట్టుబడి శ్రీనివాస్‌రెడ్డి సమకూర్చుతుండగా, రవాణా, ఎగుమతి వ్యవహారాలు రాజశేఖర్‌రెడ్డి, అతని భార్య ప్రీతి చూసుకునేవారని ఎన్‌సిబి అధికారులు తెలిపారు. ముంబయిలోని బడా స్మగ్లర్ నబీద్ సాయంతో ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాలకు సరఫరా చేసేవారని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నబీద్, రామ్మూర్తి, శ్రీనివాస్‌రెడ్డి చిక్కితే డ్రగ్స్ మాఫియా వెనుక దాగిన రహస్యాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్టు ఎన్‌సిబి అధికారులు భావిస్తున్నారు.