తెలంగాణ

ఇంగితం లేకుండా విమర్శలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన హోదాను మరచి, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. కెసిఆర్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని ప్రజలు అనుకుంటున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. అంతకు ముందు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో అత్యవసరంగా సమావేశమై చర్చించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం సైన్యంలో పని చేసిన తనను కించపరిచేలా మాట్లాడారని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రజలను కలవరని, చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలను కలవరని అన్నారు. దేశ చరిత్రలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఉండరని ఆయన విమర్శించారు. కెసిఆర్‌కు ఇంగిత జ్ఞానం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో గత పాలకులు తెలంగాణ నుంచి ఎపికి దోచిపెడుతున్నారని కెసిఆర్ విమర్శించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కెసిఆర్ దోచి పెడుతున్నదంతా తాము బయటపెడతామని అన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రుణ మాఫీ పూర్తిగా చేయలేదని, రుణ మాఫీకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని తాము అన్నందుకు ముఖ్యమంత్రికి కోపం వచ్చిందని అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల వైద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. అయినా వాటర్ గ్రిడ్‌కు, ఇరిగేషన్‌కు డబ్బులు ఇస్తున్నారని ఆయన తెలిపారు. తమకు సోయి లేదని ముఖ్యమంత్రి అన్నారని, సోయి లేనిది ప్రభుత్వానికి, సోయి లేనిది కెసిఆర్‌కేనని ఆయన విమర్శించారు. తాము కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకించలేదని, అశాస్ర్తియంగా జరుగుతున్నదని అన్నామని చెప్పారు.
సవాల్ విసిరిన భట్టి
భట్టివిక్రమార్క మాట్లాడుతూ కెసిఆర్‌కు సవాల్ విసిరారు. రైతులు సంతోషంగా మేకలు కోసుకుని తింటున్నారని ముఖ్యమంత్రి చెప్పడాన్ని ఆయన ఖండించారు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే పోలీసులను, గన్‌మెన్లను పక్కన పెట్టి చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్ ఏ జిల్లాలోనైనా చర్చిద్దామని అన్నారు. తమకు సోయి ఉంది కాబట్టి రైతుల కష్టాల్లో పాలు పంచుకునేందుకు వెళ్ళామని అన్నారు.