ఆంధ్రప్రదేశ్‌

మహిషాసురమర్దనిగా విజయవాడ దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 10: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్ముఖ నామ సంవత్సర దసరా మహోత్సవాల్లో పదో రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమి సోమవారం శ్రీ దుర్గాదేవి శ్రీ మహిషాసుర మర్దనీదేవి అలంకారంలో దర్శనమిచ్చి భక్తకోటిని పులకింపచేసింది. ఈ దసరా వేడుకల్లో అత్యంత పర్వదినాలైన మూడింటిలో శరన్నవమి అత్యంత పవిత్రమైంది. చండీ సప్తశతిలో దుర్గాదేవి అష్ట్భుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకోపకారం చేసిన ఘట్టం వర్ణితమైంది. సింహ వాహినిగా రూపొందిన శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురుడి సేనాపతులైన బిక్షరుడు, చమరుడు, ఉదద్రుడు, భాష్కుతుడు, బిడాలుడు వంటి రాక్షసులందరినీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుడిని చంపి అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద స్వయంభువైనది. ఇక శత చండీ హోమాది క్రతువులతో ఇంద్రకీలాద్రి 10రోజులుగా ధార్మిక తేజస్సు మధ్య ప్రజ్వలిస్తోంది. నివేదనలు, నిత్య సహస్రనామ పారాయణాలతో అలరారుతున్న ఉత్సవ మూర్తులతో పాటు గర్భాలయంలో విశేషాలంకరణలో నెలవైన మూలవిరాట్టును తిలకించి భక్తులు తమ ఇలవేల్పుకు మొక్కుబడులు సమర్పించుకుంటున్నారు. ఇక తెల్లవారుఝాము నుంచి భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం బారులు దీరారు. ఇక ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా శ్రీ కనకదుర్గాదేవిని కృష్ణానదిలో హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. మంగళవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కొండ దిగువకు తీసుకువచ్చి హంస వాహనంపై ఉంచి మూడుసార్లు కనుల పండువగా జలవిహారాన్ని జరిపిస్తారు. చివరిరోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవిగా భక్తకోటికి దర్శనమివ్వనుంది. నేడు దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖుల్లో ఒకరైన రాష్ట్ర ఆర్థికశాఖ కమిషనర్ కెవిఎస్ ప్రసాద్, అన్నదాన కార్యక్రమానికి ఒక లక్ష రూపాయలు విరాళం అందజేశారు. కృష్ణాజిల్లా న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఎబి వెంకటేశ్వరరావు, తదితరులున్నారు.
chitram..
మహిషాసురమర్దనిగా పూజలందుకుంటున్న కనకదుర్గమ్మ .. ఇంద్రకీలాద్రిపై సోమవారం భక్తుల కోలాహలం