ఆంధ్రప్రదేశ్‌

సర్వేకు నెలాఖరే డెడ్‌లైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: ప్రజాసాధికార సర్వేను ఎట్టిపరిస్థితుల్లో ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన సర్వేను త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం వుందన్నారు. శుక్రవారం విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి జిల్లా కలెక్టర్లతో ప్రజాసాధికార సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి సర్వే ఎంతవరకు వచ్చిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం వరకు ప్రజాసాధికార సర్వే 71 శాతం పూర్తయ్యిందని, గ్రామీణ ప్రాంతాల్లో 78శాతం, పట్టణ ప్రాంతాల్లో 57శాతం సర్వేను పూర్తిచేశామని అధికారులు ఆయనకు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో సర్వే మందకొడిగా సాగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. దసరా సెలవులు పూర్తయినందున సర్వేను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సర్వేకు డివైజ్‌ల కొరత వుంటే తక్షణం కొనాలని ఆదేశించారు. ఎక్కడ నెట్‌వర్క్ సమస్యలు తలెత్తితే అక్కడ ఆఫ్‌లైన్‌లో సర్వే పూర్తిచేయాలని చెప్పారు. ఆధార్, రేషన్ కార్డ్, ఎల్పీజీ కనెక్షన్ సహా అన్ని వివరాలను తప్పనిసరిగా సర్వే ద్వారా అనుసంధానించాలని చెప్పారు. సర్వేను విజయవంతం చేసి నూటికి నూరుశాతం ప్రజల్లో సంతృప్తి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. డేటా పూర్తిగా అప్‌డేట్ అయితే అధికారులు రియల్ టైమ్‌లో విధులు సులభతరంగా నిర్వహించవచ్చన్నారు. సర్వేలో సేకరించిన వివరాలు సమగ్రంగా, కచ్చితత్వం కలిగి వుండాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎన్యూమరేటర్లు సర్వే కోసం ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించాలని, సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సర్వేలో ఉత్తమ పనితీరు కనబరిచిన పలువురిని పెర్ఫార్మెన్స్ కమిటీ ద్వారా ఎంపిక చేసి నవంబర్ మొదటి వారంలో ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పింఛన్ల జారీలో సరికొత్త విధానం ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ప్రతి లబ్ధిదారుని ఫొటో ఆన్‌లైన్‌లో వుంచతామని, అలాగే వేలిముద్రలు సైతం సేకరిస్తామన్నారు. పింఛన్ల పంపిణీలో అక్రమాలను సహించేది లేదన్నారు. త్వరలో బయోమెట్రిక్ విధానం ద్వారా, లేదంటే ఐరిస్ పద్ధతిలో రేషన్ సరుకులు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ విధానంతో అవకతవకలకు ఆస్కారం లేకుండా రియల్ టైమ్‌తో డేటాను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు. పిడిఎస్‌లో లబ్ధిదారుల వేలిముద్రలు తప్పనిసరిగా తీసుకోవాలని, ఏడాదికోసారి వాటిని పునఃపరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
సర్వేతో అందరికీ లబ్ధి
సర్వేలో సేకరించిన సమాచారంతో రాష్టస్థ్రాయిలో ప్రణాళికలు రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నవంబర్ 1 నుంచి సర్వే సమాచారాన్ని వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అందిపుచ్చుకోవాలంటే ప్రజలంతా సర్వేలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వస్థలం నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లినవారు సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకునేందుకు అదనంగా రెండు నెలల సమయం ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రజాసాధికార సర్వేపై వచ్చే శుక్రవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. కాగా, సర్వేను 80శాతం పూర్తిచేసి అనంతపురం జిల్లా ముందువరుసలో ఉంది. 77శాతంతో పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

జగన్‌కు ప్రత్యేక హోదా రొట్టె
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, అక్టోబర్ 14: నెల్లూరులో గత మూడు రోజులుగా జరుగుతున్న రొట్టెల పండగకు శుక్రవారం ప్రతిపక్షనేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు నెల్లూరు చేరుకున్న ఆయన నేరుగా రొట్టెల పండగ జరిగే బారాషాహీద్ దర్గాకు చేరుకున్నారు. దర్గాలో మతపెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఉన్న స్వర్ణాల చెరువులో ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేక హోదా రొట్టెను స్వీకరించారు. తాను అందుకున్న రొట్టెను ఆయన నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా, స్థానిక ఎమ్మెల్యేలు మేకపాటి గౌతంరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్‌ద్వారకానాథ్‌లకు పంచిపెట్టారు. జగన్మోహన్‌రెడ్డిని చూసేందుకు, కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. జగన్ సైతం అందరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు

అమరావతిలా
తిరుపతి అభివృద్ధి
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
తిరుపతి, అక్టోబర్ 14: రాష్ట్ర రాజధాని అమరావతిలాగా తిరుపతినీ అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లాల్సిన ముఖ్యమంత్రి తిరుపతిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రెండో విడత రుణమాఫీ సందర్భంగా డ్వాక్రా మహిళలు కృతజ్ఞతా సూచికంగా అలిపిరి వద్ద తెలుగుమహిళలు ముఖ్యమంత్రిచే కేక్ కట్ చేయించారు. ఆయన స్కావెంజర్స్‌కాలనీ, కొర్లగుంట, సత్యనారాయణ పురం, జీవకోన, క్రాంతి నగర్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీచేసి పారిశుద్ధ్యం పనులను పర్యవేక్షించి ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ముఖ్యంగా తాగునీటి సమస్య, ఇంటి పట్టాలు విషయం సిఎం దృష్టికి తీసుకురాగా సీ ఎం స్పందించి గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల నేడు అనేక కష్టాలు ఏర్పడిందని, తెదేపా ప్రభుత్వం ప్రజలకు అండదండగా ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఒకరికి 50వేల రూపాయలు సిఎం సహాయ నిధి నుంచి అందించారు. అకారంపల్లి రోడ్డులోని మద్దిమాను సర్కిల్‌లో ముఖ్యమంత్రి విలేఖకరులతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిలాగే తిరుపతిని అభివృద్ధిచేస్తామని, ఇందుకు ప్రజలు సహకరించాలన్నారు. రాష్ట్రంలో 1.23 లక్షల ఇళ్లను బహుళ అంతస్థుల సముదాయంగా నిర్మించడానికి ప్రణాళికలు అమలుచేయుచున్నామని, 2022 నాటికి అర్హులందరికీ ఇళ్లు అందజేస్తామన్నారు. తిరుపతిని మెగా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు

టెలీకాన్ఫరెన్స్‌లంటే
ఇంత ఆషామాషీనా?
మొక్కుబడిగా తీసుకుంటే సహించేది లేదు
అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కనె్నర్ర
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 14: అనునిత్యం అనేక అంశాలపై టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించడంలో దేశంలోనే అగ్రస్థానం వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో వీటి వల్ల ఆశించిన ఫలితాలు చేకూరటం లేదనే అనుమానం తొలిసారి మొదలైంది. శుక్రవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల అధికారులపై ఆయన నిప్పులు చెరిగారు. ఇక నుంచి తాను నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌లను ఆషామాషీగా తీసుకుంటే సహించేదిలేదని కూడా హెచ్చరించారు. టెలీకాన్ఫరెన్స్‌కు వచ్చేముందు ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో తాము సాధించిన ఫలితాలకు సంబంధించిన గణాంకాలతో రావాలని కఠినంగానే చెప్పారు. అసలు ఫలితాలు సాధించని ఇలాంటి సమీక్షలు వృథా అంటూ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తపర్చారు. ఏదో ఆదేశిస్తున్నాకదా అని గణాంకాలు మార్చి తనను మభ్యపెట్టాలని చూస్తే సహించనని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏపిని అగ్రగామిగా నిలపడమే మనందరి ధ్యేయం కావాలన్నారు. కొన్నిచోట్ల నూటికి నూరు శాతం, మరికొన్నిచోట్ల తక్కువ శాతం ఫలితాలు కన్పిస్తున్నాయంటూ అలాకాకుండా రాష్టమ్రంతటా ఒకే తీరులో ఉత్తమ ఫలితాలు రావాలన్నారు. రియల్ టైమ్ టెక్నాలజీని అందుబాటులోకి తేవటం వల్ల ఫలితాలు కూడా దానికి తగ్గట్లే కనపరచాలన్నారు. మూస పద్ధతిలో వెళితే ఆశించిన ఫలితాలు రావని, సృజనాత్మకంగా, వినూత్నంగా ఉత్తమ సాగు పద్ధతులు అవలంభిస్తే ఉత్పాదకత పెరుగుతుందన్నారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటులో ఇప్పటివరకు 25 శాతం ప్రక్రియ పూర్తయిందని, జనవరి నాటికి మొత్తం 10లక్షల మంది రైతులను వీటి పరిధిలోకి తేవాలన్నారు.