ఆంధ్రప్రదేశ్‌

శుభ్రతే భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ స్టేట్‌గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చదువుతోపాటు విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ‘వరల్డ్ హ్యాండ్ వాష్ డే’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. వందలమంది విద్యార్థులతో కలిసి ఆయన చేతులు శుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కోరారు. అప్పుడే ఏపి నాలెడ్జ్ స్టేట్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. శాస్తవ్రేత్తలుగా విద్యార్థులు ఎదగాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విద్యార్థులు చేయూత నందించాలన్నారు. ప్రజలు ఆహారపు అలవాట్లు మార్చుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే బాధ్యత విద్యా, వైద్యశాఖదే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, జిల్లా పరిషత్ చైర్మన్ గద్దె అనూరాధ, ఎంపి కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు చేతులు శుభ్రం చేసుకుంటున్న చంద్రబాబు