రాష్ట్రీయం

ఏడాదిలో పదివేల టీచర్ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త టీచర్లు వస్తారని, టీచర్ల నియామకానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. పదివేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. 2017-18 విద్యా సంవత్సరానికి మొత్తం 460 గురుకుల పాఠశాలలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. నాంపల్లిలోని సర్వశిక్షా అభియాన్ భవన్‌లో ఆర్‌జెడిఈ, డిఇవో, అసిస్టెంట్ డైరెక్టర్లకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాలను కడియం శ్రీహరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలపై చర్చించారు. విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. త్వరలోనే రేషనలైజేషన్ పూర్తిచేసి టీచర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. విద్యాశాఖలో అవినీతిని సహించేది లేదని, డిఇఓలు నిజాయితీగా పని చేయాలని, అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త జిల్లాల్లో డిఇఓలు విద్యాశాఖకు మంచి పేరు తేవాలన్నారు. జిల్లాల సంఖ్య పెరగడం వల్ల డిఇఓలకు మంచి అవకాశాలు లభించాయిని, తమ పరిధిలోని విద్యాసంస్థలు చక్కగా పని చేసేలా కృషి చేయాలన్నారు. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందేలా డిఇఓలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో పది జిల్లాలుంటే ఇప్పుడవి 31 జిల్లాలుగా మారినందున పాఠశాలల పనితీరు మెరుగుపడేలా డిఇఓలు పనిచేయడానికి అవకాశం లభించిందన్నారు. తెలంగాణ విద్యార్థులు దేశంలో నంబర్‌వన్‌గా ఉండాలన్నారు. విద్యారంగంలో మార్పుల గురించి చర్చించిన చర్చా కార్యక్రమంలో ఆర్‌జెడిఈ, డిఇఓ, అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

చిత్రం.. ఆర్‌జెడిఈ, డిఇవో, ఎడిల శిక్షణ కార్యక్రమంలో
మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి