రాష్ట్రీయం

లక్ష గ్రామాలకు సంఘ్ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారత కార్యకారిణి (వర్కింగ్ కమిటీ) సమావేశాలు బుధవారం (19న) నుంచి ప్రారంభం కాబోతున్నాయి. నగర శివారులోని ఘట్‌కేసర్ మండలంలోని అన్నోజిగూడలోని విద్యావిహార్ పాఠశాల ప్రాంగణం వేదికగా ముస్తాబైంది.
ఈ నెల 27వ తేదీ వరకు జరగబోయే సమావేశాల్లో సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్‌జీ భాగవత్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. సుమారు 415 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశాల్లో సంఘ్ ప్రముఖులు భయ్యాజీ జోషి, దత్తాత్రేయ హోసబలె (దత్తాజీ), కృష్ణ గోపాల్ జీ, భాగయ్య ప్రభృతులు పాల్గొంటారు. అక్టోబర్ 23, 24, 25 తేదీల్లో ముఖ్యమైన అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల చర్చించనున్నారు.
దేశవ్యాప్తంగా లక్ష గ్రామాలకు సంఘ్‌ను విస్తరించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్ళే అంశంపై చర్చించి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ప్రతి ఏడాది మూడు పర్యాయాలు ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు జరుగుతుంటాయి. మార్చిలో అఖిల భారత ప్రతినిధి సభ (జనరల్ బాడీ మీటింగ్), జూలైలో కార్యనిర్వాహక కమిటీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ), అక్టోబర్‌లో అఖిల భారత కార్యకారిణి (వర్కింగ్ కమిటీ) సమావేశాలు జరుగుతాయి. ఇందులో భాగంగా కార్యకారిణి సమావేశాలు హైదరాబాద్‌లో జరగడం ఇదే ప్రథమం.