రాష్ట్రీయం

నాణ్యతకు రహదారి వేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: పదేళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణానికి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సిఎం కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుత రహదారుల పరిస్థితి? ఎలా ఉంటే బావుంటుంది? మెరుగైన రహదారుల వ్యవస్థకు చేపట్టాల్సిన కార్యక్రమాలు? తదితర అంశాలపై అధ్యయనం జరగాలని సిఎం సూచించారు. సిఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోడ్లు భవనాల శాఖపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో జాతీయ రహదారులుగా మార్చాల్సిన రహదారులు ఏవి? కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా నిర్మించాల్సిన రోడ్లు ఏవి? ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రహదారుల నిర్మాణం ఎలా ఉండాలో ప్రతిపాదనలు రూపొందించాలని కెసిఆర్ ఆదేశించారు. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి తెలంగాణ అవలంభించే విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మెరుగుదల రోడ్ల నాణ్యతపైనే ఆధారపడి ఉందన్నారు. ఎక్కడ ఎలాంటి రహదారుల నిర్మాణం అవసరమో గుర్తించి దానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమదృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 2500 కిలోమీటర్ల నిడివిగల జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసిందన్నారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్ ఆవలినుంచి 330 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని, రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. డిపిఆర్‌లు సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారని, అవసరమైతే పనిని ఎక్కువ ప్యాకేజీలుగా విభజించి తక్కువ సమయంలో డిపిఆర్‌లు పూర్తి చేయాలన్నారు. రహదారులు నిర్మించడమే కాకుండా అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వర్షంవస్తే రోడ్లు దెబ్బతినే ప్రాంతాలను గుర్తించి అక్కడ పకడ్భందీగా నిర్మాణ చర్యలు చేపట్టాలన్నారు. యూరోప్, అమెరికా దేశాల్లో రహదారులు బాగుంటాయని, అక్కడ ఎలాంటి పద్ధతులను అవలంభిస్తున్నారో అధ్యయనం చేయాలన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట అవసరమైనచోట ఆర్‌ఓబిలు, ఆర్‌యుబిలు, నదులు, కాల్వలపై వంతెనలు, కాజ్‌వేలు, బైపాస్ రహదారులను విజన్ డాక్యుమెంటరీలో పొందుపర్చాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారులు పట్టణాలు, పెద్ద గ్రామాలగుండా వెళ్లకుండా బైపాస్‌లు నిర్మించాలన్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువున్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రహదారలు నిర్మించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

చిత్రం.. రాష్ట్రంలోని రహదారుల వ్యవస్థపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్