రాష్ట్రీయం

ఆరు వారాల్లోగా ఎల్‌పిసెట్‌ను నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ రాష్ట్రంలో తెలుగు, హిందీ, ఉర్దూ భాషలకు సంబంధించి లాంగ్వేజి పండిట్ ప్రవేశపరీక్షను ఆరు వారాల్లోగా నిర్వహించాలని పాఠశాల విద్య డైరెక్టరేట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆదేశాలను జస్టిస్ ఎంస్ రామచంద్రరావు జారీ చేశారు. వికాస్ తెలుగు పండిట్ ట్రైనింగ్ కాలేజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.
ఆర్‌ఎస్‌ఎస్ భేటీకి అమిత్ షా?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 19: హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్ మండలం అన్నోజిగుడాలో ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. బుధవారం ప్రారంభమైన సమావేశాలు 25వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే ముఖ్యమైన అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సమావేశాలు 22 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నాలుగు రోజుల్లో ఏదైనా ఒక రోజు అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23న (ఆదివారం) వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.