ఆంధ్రప్రదేశ్‌

కోస్ట్‌గార్డ్ సేవలో ‘రాణి గైడిన్‌ల్యు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 19: సముద్ర జలాల పరిరక్షణకు అహరహం శ్రమిస్తున్న భారత తీర రక్షణ దళంలోకి మరో అత్యాధునిక నౌక వచ్చి చేరింది. స్వాతంత్య్ర సమరయోధురాలు, ఆధ్యాత్మికవేత్త మణిపాల్ ప్రాంతానికి చెందిన రాణి గైడిల్యు పేరిట రూపొందించిన కోస్ట్‌గార్డ్ నౌకను బుధవారం విశాఖలో జలప్రవేశం చేయించారు. ముఖ్య అతిథిగా హాజరైన కోస్ట్‌గార్డ్ డైరక్టర్ జనరల్ రాజేంద్ర సింగ్ లాంఛనప్రాయంగా ఈ నౌకను జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర జలాల పరిరక్షణలో కోస్ట్‌గార్డ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. భారత సముద్ర జలాల్లోకి చొరబాటుదార్లను, సముద్ర దొంగలను అరికట్టడంలో కోస్ట్‌గార్డ్ విశేషంగా కృషి చేస్తోందని ఆయన చెప్పారు. కోస్ట్‌గార్డ్ వద్ద ప్రస్తుతం 123 నౌకలు, 52 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని ఆయన తెలియచేశారు. తాజాగా కోస్ట్‌గార్డ్‌లో చేరిన రాణి గైడిల్యు ఒక వజ్రం వంటిదని అన్నారు. మర్చంట్ షిప్స్, సెయిలర్స్, మత్స్యకారుల పరిక్షణకు ఈ నౌక ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఈ నౌక విశాఖ షిప్‌యార్డులో తయారవడం ముదావహమని అన్నారు. కోస్ట్‌గార్డ్ కమాండర్ (ఈస్ట్) రాజన్ బర్గోత్రా మాట్లాడుతూ కోస్ట్‌గార్డ్ నౌకల తయారీలో హిందుస్థాన్ షిప్‌యార్డు కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ నౌకకు కమాండెంట్ రమేష్ వసంత్‌తాల్కే కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మణిపూర్ డిప్యూటీ సిఎం గైకంగం, అదే రాష్ట్రానికి చెందిన తొనాజంచోబాసింగ్, షిప్‌యార్డ్ చైర్మన్, నగర పోలీస్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

ఐసిజిఎస్ రాణి గైడిన్‌ల్యు నౌకను సందర్శించి వస్తున్న తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్త్, తదితరులు

నౌకాదళంలో ఐఎన్‌ఎస్ తిహాయు

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 19: కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించిన వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఐఎన్‌ఎస్ తిహాయును నౌకాదళ సేవల్లోకి బుధవారం ప్రవేశపెట్టారు. నౌకాదళం సమకూర్చుకోనున్న ఈ తరహా నాలుగు నౌకల్లో ఇది రెండవది. మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా ఈ నౌకను దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. నికోబార్ దీవుల్లోని పెద్ద దీవి తిహాయు పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ సందర్భంగా విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్ మాట్లాడుతూ ఈ తరహా ఫాస్ట్ అటాక్ నౌకలను 16 కలిగి ఉందని తెలిపారు. దేశ భద్రతకు, ఆర్థికాభివృద్ధికి తీర రక్షణ కీలకమని, ఈ దిశగా నౌకాదళం బలోపేతం అవుతున్నదన్నారు.
వచ్చే ఏడాది రెండు నౌకలను తూర్పు నౌకాదళం సమకూర్చుకోనుందని తెలిపారు. ఇది కాక ప్రాజెక్టు 17 పేరుతో మరిన్ని నౌకలను సమకూర్చుకోనున్నట్లు వెల్లడించారు. గ్రీన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సిఎండి ఎ.కె.వర్మ మాట్లాడుతూ నౌకాదళానికి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌లను 20 సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఇది రెండవదని, ఇప్పటికి 98 నౌకలను తమ షిప్‌యార్డు నిర్మించిందని తెలిపారు. మరో రెండు నెలల్లో రెండు నౌకలను నిర్మించి 100 నౌకల నిర్మాణాన్ని పూర్తి చేసుకోనున్నట్లు చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఈ నౌకను నిర్మించినట్లు తెలిపారు. రానున్న సంవత్సరంన్నర కాలంలో 20 నౌకలను నిర్మించేందుకు నిర్ణయించామని, ఇప్పటికే అవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. గత ఏడాది 1700 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించి, 247 కోట్ల రూపాయల మేరకు లాభాన్ని ఆర్జించామన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళ హెడ్ క్వార్టర్స్ చీఫ్ స్ట్ఫా ఆఫీసర్ రియర్ అడ్మిరల్ మహేష్ సింగ్, వైస్ అడ్మిరల్ ఎకె జైన్, నేవల్ ఆఫీసర్ ఇన్‌చార్జి (ఆంధ్రప్రదేశ్) కమోడోర్ సంజీవ్ ఇస్సార్ తదితరులు పాల్గొన్నారు.

ఐఎన్‌ఎస్ తిహాయు నౌక ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న
తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్త్