ఆంధ్రప్రదేశ్‌

ఏజెన్సీని అనుసంధానిస్తూ హైవేల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 19: ఏజెన్సీ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలను కేంద్రానికి అందజేసినట్టు ఆర్‌అండ్‌బి జాతీయ రహదారుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఆర్ గోపాలకృష్ణ వెల్లడించారు. విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించే అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ కోఆర్డినేటర్ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి రాజమండ్రి, రంపచోడవరం, కొయ్యూరు, చింతపల్లి, పాడేరు, అరుకు వరకూ సుమారు 400 కిలోమీటర్ల మేర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రహదారులను 10 మీటర్ల వెడల్పుకు విస్తరించేందుకు వీలుగా సమగ్ర పథక నివేదిక (డిపిఆర్) సిద్ధం చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రహదారిని నాలుగు లేన్లను విస్తరించనున్నట్టు తెలిపారు. డిపిఆర్ సిద్ధం చేసి తుది ప్రతిపాదనలను డిసెంబర్ నెలాఖరునాటికి కేంద్రానికి సమర్పించనున్నట్టు తెలిపారు. ఒక్క కిలోమీటరు రహదారి నిర్మాణానికి రూ.5 కోట్లు ఖర్చవుతుందన్నారు. మొత్తం రాష్ట్రంలో 1,600 కిలోమీటర్ల మేర రహదారులను జాతీయ రహదారుల విభాగానికి బదలాయించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2000 కిమీ రహదారులను 10 మీటర్ల మేర వెడల్పు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర రహదారుల్లో బ్లాక్‌స్పాట్ గుర్తించేందుకు రోడ్ సేఫ్టీ ఆడిట్ (సర్వే) చేపట్టామన్నారు. ఇంజనీరింగ్ తప్పిదాలను గుర్తించి, వాటిని చక్కదిద్దేందుకు వీలుగా డిపిఆర్ రూపొందిస్తున్నామన్నారు. చెన్నై - కోల్‌కతా నుంచి విజయనగరం మీదుగా రాయపూర్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించే పనులకు సంబంధించి డిపిఆర్ జరుగుతోందని తెలిపారు. విజయనగరానికి 17.5 కిలోమీటర్ల మేర బైపాస్ రహదారి నిర్మాణానికి సర్వే జరుగుతోందన్నారు. 12 కిమీమేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు. 21,22 తేదీల్లో అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్స్ సెమినార్‌ను విశాఖలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్రిడ్జి అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఆర్ అండ్ బి సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

శ్రీశైల మల్లన్నకు కార్తీక
మాసంలోనూ అభిషేకాలు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, అక్టోబర్ 19: భక్తుల రద్దీతో కిటకిటలాడే కార్తీక మాసంలో కూడా శ్రీశైలంలో మల్లికార్జునస్వామికి అభిషేకాలు నిర్వహించడానికి శ్రీశైలం ఆలయ కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్ గుప్తా బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 31 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసోత్సవాల్లో ప్రతి రోజు స్వామి వారి అభిషేకానికి భక్తులను అనుమతించనున్నారు. ఒక్కో భక్తుడు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి రోజు 1500 మంది భక్తులకు అభిషేకం చేసే వీలు కల్పించారు. అభిషేకం టికెట్లను ఆన్‌లైన్‌లో తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంఆన్‌లైన్.కాం అనే వెబ్‌సైట్‌లో భక్తులు టికెట్లను పొందవచ్చని ఈవో నారాయణ భరత్ గుప్తా తెలిపారు. కార్తీక మాసంలో సాధారణ రోజులతో పాటు భక్తులు పవిత్రంగా భావించే సోమవారం సైతం అభిషేకం చేసే అవకాశం కల్పించారు.