ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలోకి బూరగడ్డ వేదవ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), అక్టోబర్ 21: విభజన అనంతరం రాష్ట్రానికి వచ్చిన కష్టాలను తన భుజాలపై వేసుకుని రాష్ట్ర ప్రజల కోసం శ్రమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దేశంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉంచాలనే తలంపుతో పనిచేస్తున్న తనకు అడుగడుగునా ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా తాడిగడప సమీపంలోని అనే్నవారి కల్యాణ మంటపంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వేదవ్యాస్‌కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని తాను మాత్రమే అభివృద్ధి చేస్తానన్న నమ్మకంతో ప్రజలు తనకు బాధ్యత అప్పజెప్పారన్నారు. నదుల అనుసంధానంతోనే అభివృద్ధికి పునాది అని భావించే పట్టిసీమను త్వరితగతిన పూర్తి చేసి కృష్ణా డెల్టాకు సరైన సమయంలో సాగునీరిచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షాలు అరాచకం సృష్టిస్తున్నాయని, ప్రజలు వాటిని జాగ్రత్తగా గమనించాలన్నారు. పిల్ల కాంగ్రెస్ నాయకుడి చేష్టలకు విసుగు చెంది ఆ పార్టీ నాయకులు తెలుగుదేశంలో చేరుతున్నారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతైందన్నారు. గత ఎన్నికలో కాపు రిజర్వేషన్ల కోసం ఎవరూ హామీ ఇవ్వలేదని తాను మాత్రమే ఇచ్చానని, హామీని తప్పకుండా నేరవేరుస్తానన్నారు. అనంతరం పెడన నియోజకవర్గం పరిధిలో వివిధ పదవుల్లో ఉన్న వైకాపా నాయకులు, కార్యకర్తలకు ఆయన పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.