ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుతో గవర్నర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం నగరానికి విచ్చేసిన గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం ఆయన బస చేసిన ఓ స్టార్ హోటల్‌లో ఏకాంతంగా కల్సి దాదాపు రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. హైదరాబాద్ నుంచి సచివాలయం పూర్తిగా తరలివచ్చిన నేపథ్యంలో అక్కడి భవనాలను తమకు అప్పగించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి ఓ ప్రతిపాదన వచ్చినట్లుగా గవర్నర్ ప్రస్తావిస్తే దానికి బదులుగా చంద్రబాబు 9, 10 షెడ్యూలు ప్రకారం జరగాల్సిన పంపకాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ముందుగా వాటి విషయం చూడాలని, ఇక సచివాలయం భవనాల అప్పగింతపై తమ మంత్రివర్గంలో చర్చించడం, ఆపై ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని సమాధానం ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. అయితే ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేవని, 9, 10 షెడ్యూలులోని అంశాలపై త్వరలోనే ఓ పరిష్కారం లభించగలదన్న ఆకాంక్ష వెలిబుచ్చారు. ఇక ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రత్యేక హోదా స్థానంలో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఒనగూరే ప్రయోజనాలు వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చట్ట ప్రకారంగా రావల్సిన నిధులను సాధ్యమైనంత త్వరగా వచ్చేలా చూడాలని గట్టిగా కోరారు. ఆ తర్వాత సిఎం మీడియాతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం పట్ల రాజీపడేది లేదని స్పష్టం చేశారు.