ఆంధ్రప్రదేశ్‌

గోదావరి చెంత నెల ముందే ఖరీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 21: వ్యవసాయ యాంత్రీకరణను అందిపుచ్చుకుని గోదావరి చెంతన రైతులు ఖరీఫ్ ముందస్తు దిగుబడి సాధించి రికార్డు సాధించారు. దాదాపు నెల రోజుల ముందుగానే ఆశాజనకమైన దిగుబడి సాధించి ప్రయోగాత్మకంగా ముందున్నారు. దాదాపు ముఫ్పై వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ మేరకు ముందస్తు దిగుబడి సాధించడం విశేషత సంతరించుకుంది. సాధారణంగా ఖరీఫ్ వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం మే నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. అయితే జూలై మొదటి వారం నుంచి గానీ పూర్తి స్థాయిలో నాట్లు పూర్తయ్యే పరిస్థితి లేదు. అంటే వ్యవసాయ నిర్ధిష్ట ప్రణాళిక కంటే దాదాపు నెలన్నరకు గానీ పూర్తి స్థాయిలో సాగు మొదలుకాని పరిస్థితి వుంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి చెంతన ఉన్న సీతానగరం, కోరుకొండ మండలాల్లో మాత్రం గోదావరి గట్టుకు సమీపంలో ఉన్న ఆయకట్టులో నెల రోజులు ముందుగానే ఖరీఫ్‌ను సాధించారు. ఎకరానికి సుమారు 35 బస్తాల దిగుబడిని తీసుకొచ్చారు. సాధారణంగా ఖరీఫ్‌లో దీపావళి తర్వాత, రబీని ఉగాదికి ముందు కోతలు మొదలు పెట్టడం రైతుల ఆనవాయితీ. అయితే సీతానగరం, కోరుకొండ మండలాల్లో దాదాపు ముఫ్పై వేల ఎకరాల ఆయకట్టులో ముందస్తుగానే ఖరీఫ్ దిగుబడి సాధించారు.
వరి కోత యంత్రాలను వినియోగించి కోతలు, నూర్పిళ్లు పూర్తిచేస్తున్నారు. రైతులకు ఎకరానికి రూ.20వేల వరకు ఖర్చయినట్టు రైతు చుండ్రు రామకృష్ణ చెప్పారు. ఈ ప్రాంత రైతులు అనుసరిస్తున్న మరో ముఖ్యమైన విధానమేమిటంటే రబీకి అవసరమైన విత్తనాన్ని ఖరీఫ్ నుంచి సేకరించడం. ఈ ప్రాంత రైతులు రబీకి అవసరమైన విత్తనాన్ని బయట మార్కెట్‌పై ఆధారపడకుండా వారి విత్తనాన్ని వారే తయారుచేసుకుంటారు. రబీ సీజన్‌కు సిఫార్సుచేసి, ఈ సీజన్ నుంచే మినీకిట్లుగా వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన ఎంటియు 1156 వంగడంతో పాటు అనాదిగా సాగు చేస్తున్న ఎంటియు 1010 వంగడమనే కాటన్ దొర సన్నాలు రకాలు సాగుచేశారు. ప్రకృతి వైపరీత్యాల రీత్యా ఖరీఫ్‌లో దిగుబడి గ్యారంటీ లేని స్థితిలో సాగుచేసి, రబీకి గ్యారంటీ దిగుబడిగా రైతులు అత్యధిక దిగుబడులు సాధించడం ఆనవాయితీగావుంది. అందుకనే ఖరీఫ్‌లో విత్తనం కోసం సాగుచేసిన వంగడాలను రబీలోవేసి అత్యధిక దిగుబడి సాధిస్తుంటారు. దాదాపు 30 వేల ఎకరాల్లో ఇతర ప్రాంతాలకు అవసరాలకు సైతం సరఫరా చేయగలమనే విధంగా ఎంటియు 1156, ఎంటియు 1010 కాటన్ దొర సన్నాలు అత్యధికంగా సాగుచేశారు.
ఇదిలావుండగా సీతానగరం, కోరుకొండ, గోకవరం, రాజమహేంద్రవరం రూరల్, జగ్గంపేట, రాజానగరం తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ఎత్తిపోతల పధకాల ద్వారా ఆయకట్టు సాగవుతోంది. సీతానగరం, కోరుకొండ మండలాల పరిధిలో వేలాది ఎకరాల భూములు గోదావరి వరద నీటిలో మునిగిపోవడం వల్ల ఖరీఫ్ సాగు చేయలేకపోయారు. భూములు నిరుపయోగంగా పెట్టి రైతులు నష్టపోయారు. సీతానగరం సమీపంలోవున్న తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం ఆధునీకరణ దృష్ట్యా ఈ ప్రాంతంలో రానున్న రబీ క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో రైతులు నల్లరేగడి భూముల్లో యధావిధిగా పొగాకు సాగు చేస్తున్నారు. వరి, ఇతర పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ ప్రాంతంలో దాదాపు ఏభై వేల ఎకరాల్లో రబీకి క్రాప్ హాలిడే ప్రకటించారు.