రాష్ట్రీయం

ఉగ్రవాదాన్ని సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని, హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదగాలంటే శాంతి నెలకొనాల్సి ఉందని, ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సి ఉందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కావడం ఆసియా ఖండంలోనే శాంతి సౌభ్రాతృత్వం నెలకొనేందుకు వీలుకల్పిస్తుందని, అనేక అడ్డంకులను తొలగించి ఇరు దేశాల మధ్య ఉదాత్తమమైన సంబంధాలు నెలకొనేందుకు వీలు కలిగిందని అన్నారు. దీనివల్ల ఆసియాలో మిగిలిన దేశాలకు సైతం మేలు కలుగుతుందని, త్వరలోనే అధికారికంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగేందుకు వీలుందని దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అన్నీ ఈ భేటీని స్వాగతించాయని అర్థం చేసుకోవాలని చెప్పారు. ఇరుదేశాల ప్రధానుల భేటీని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ సైతం స్వాగతించారంటే ఉగ్రవాదం ఎంత తీవ్రమైన సమస్యో అర్థం అవుతుందని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ దేశ హితం కోసం కృషి చేయాలని చెప్పారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని దత్తాత్రేయ సూచించారు. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మైనారిటీల ఓట్ల భయం పట్టుకోవడం వల్లనే ప్రధాని పాక్ పర్యటనను తప్పుపడుతోందని విమర్శించారు.