రాష్ట్రీయం

న్యాయవిద్యను వ్యాపారం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: న్యాయవిద్యా కళాశాలలు వ్యాపార సంస్థలు కారాదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. సరైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రాలోనూ పలు న్యాయ విద్యా కళాశాలల అనుమతిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. అన్ని విద్యాసంస్థల్లో మూట్ కోర్టులు, లైబ్రరీలు, ఆన్‌లైన్ డిజిటల్ పుస్తకాలతో పాటు అన్ని అంశాల్లో గ్రంథాలు అందుబాటులో ఉంచాలని బార్ కౌన్సిల్ విద్యాసంస్థలను ఆదేశించింది. మరో పక్క వచ్చే ఏడాది నుండి దేశ వ్యాప్తంగా న్యాయ విద్యలో చేరేందుకు కనీస వయో పరిమితిని నిర్ధారించింది. మూడేళ్ల కోర్సుకు గరిష్ఠంగా 30 ఏళ్లు, ఐదేళ్ల కోర్సుకు 20 ఏళ్ల వయోపరిమితిని అమలుచేయనున్నారు. ఆంధ్రాలో 28 కాలేజీలకు, తెలంగాణలో 22 కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది.
వాల్తేర్ లోని డాక్టర్ అంబేద్కర్ కాలేజీ ఆఫ్ లా, విజయనగరం ఎంఆర్‌విఆర్‌జిఆర్ లా కాలేజీ, వరంగల్‌లోని యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ లా, ఉస్మానియా యూనివర్ళిటీ కాలేజీ ఆఫ్ లా , తిరుపతి అనంత కాలేజీ ఆఫ్ లా, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లా ఫ్యాకల్టీ అంశాలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ ఎడ్యుకేషన్ కమిటీకి సిఫార్సు చేసింది.
మరో ఆరు న్యాయ విద్యాసంస్థల అనుమతిని నిలిపివేసింది. అందులో నాగార్జున నగర్‌లోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్, వైజాగ్ ఆల్ సెయింట్స్ క్రిస్టియన్ లా కాలేజీ, కరీంనగర్ జస్టిస్ కుమారయ్య కాలేజీ ఆఫ్ లా, చిత్తూరు ఆర్‌ఎం లా కాలేజీ, తిరుపతి శ్రీ వేంకటేశ్వర కాలేజీ ఆఫ్ లా, తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ లా కాలేజీలకు ఇంత వరకూ అనుమతి ఇవ్వలేదు. అయితే ఇప్పటికే ఈ కాలేజీల ఆకస్మిక తనిఖీల ప్రక్రియ పూర్తి అయినా, వాటి నివేదికలు ఇంకా అందాల్సి ఉంది, అవి రాగానే ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లకు అనుమతించేది లేనిదీ తేలుతుంది.
కాగా ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యామండలి న్యాయ విద్యా కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో మూడేళ్ల న్యాయ విద్యా కళాశాలలు 22 ఉన్నాయి, వాటిలో 3320 సీట్లు ఉండగా, 9897 మంది అర్హత సాధించారు. ఐదేళ్ల న్యాయవిద్యా కాలేజీలు 15 ఉండగా, వాటిలో 1740 సీట్లకు 2811 మంది అర్హత సాధించారు. ఎల్‌ఎల్‌ఎం కోర్సు కోసం 12 కాలేజీల్లో 560 సీట్లు ఉన్నాయి.
రెండో దశ కౌనె్సలింగ్ నవంబర్ 14 నుండి 15వ తేదీ వరకూ కొనసాగించి , 16వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తామని అధికారులు చెప్పారు. ఒయు పిజి కాలేజీ ఆఫ్ లా, సుల్తాన్ ఉలుం , పడాల రామిరెడ్డి లా కాలేజీ, డాక్టర్ అంబేద్కర్ లా కాలేజీ, పొనుగోటి మాధవరావు లా కాలేజీ, కెవి రంగారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా, మహాత్మాగాంధీ లా కాలేజీ, లా కాలేజీ ఫర్ ఉమెన్ (ఆంధ్రమహిళా సభ), పెండేకంటి లా కాలేజీ, భాస్కర లా కాలేజీ, మర్వాడీ శిక్షా సమితి లా కాలేజీ, అరోరా లీగల్ సైన్స్ ఇనిస్టిట్యూట్, వినాయక లా కాలేజీ, కేశవ్ మెమోరియల్ కాలేజీ ఆఫ్ లా, అనంత లా కాలేజీ, అరోరా లీగల్ సైనె్సస్ అకాడమి, తెలంగాణ యూనివర్శిటీ లా కాలేజీలకు ఇప్పటికే అనుమతి దక్కింది. కాకతీయ యూనివర్శిటీ లా కాలేజీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ లా కాలేజీలకు ఒకటి రెండు రోజుల్లో అనుమతి రానుంది. జస్టిస్ కొమరయ్య లా కాలేజీకి సంబంధించి డాక్యుమెంట్లను సమర్పించినట్టయితే దానికి కూడా అనుమతి దక్కే వీలుందని ఉన్నతవిద్యా మండలి అధికారి ఒకరు చెప్పారు.