రాష్ట్రీయం

చేతివృత్తుల వారి శిక్షణకు వంద కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: వెనుకబడిన వర్గాల్లోని చేతి వృత్తుల వారికి ప్రత్యేక శిక్షణతోపాటు వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు కేటాయించాలని బిజెపి నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బిసి కమిషన్‌కు చైర్మన్, సభ్యులుగా నియమితులైన వారిని దత్తాత్రేయ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి కమిషన్ చైర్మన్, సభ్యులు ఢిల్లీకి వస్తే తాను కేంద్ర మంత్రులను, బిసి శాఖను పరిచయం చేసి తెలంగాణలో బిసిల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. బిసి కమిషన్‌ను ఆలస్యంగానైనా ఏర్పాటు చేసినందుకు సంతోషమని అన్నారు. బిసిల సమస్యలు పేరుకుపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిసి విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది వాస్తవమేనని అన్నారు. సుప్రీం కోర్టులోనైనా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా వాదన వినిపించాలని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే రెండు రాష్ట్రాల వివాదం చెలరేగిందని ఆయన విమర్శించారు.

చిత్రం... బిసి కమిషన్ చైర్మన్, సభ్యులను అభినందిస్తున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ