రాష్ట్రీయం

పాలనలో మార్పు చూపిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: జిల్లాలవారీగా ‘నో యువర్ డిస్ట్రిక్ట్స్- ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్’ నినాదంతో ప్రణాళికలు రూపొందించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల భౌగోళిక పరిస్థితులు, స్థానిక అవసరాలు, వనరులపై ముందు అవగాహన ఏర్పర్చుకుని, తరువాత ఏ జిల్లాలో ఏంచేయాలన్న దానిపై రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. ఎనిమిది పదేళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచించాలని, ఇప్పటినుంచే ఆ పని ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో పరిపాలనా విభాగాల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రజా సేవ, అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు ఆఫీసులో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్ ఐఏఎస్ అధికారులు బిపి ఆచార్య, నర్సింగ్‌రావు, శాంతకుమారి, జనార్దన్‌రెడ్డి, వాకాటి కరుణ, రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు, సత్యనారాయణరెడ్డి, స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, భూపాల్‌రెడ్డి తదితరులతో మెరుగైన పాలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఎటుపడితే అటు అడ్డదిడ్డంగా కాకుండా పద్ధతి ప్రకారం పాలన సాగేలా రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. గతంలో జిల్లాల విస్తీర్ణం, జనాభా ఎక్కువ ఉండేదని, దీనివల్ల కలెక్టర్లకు పాలనా వ్యవహారాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం కష్టతరంగా ఉండేదన్నారు. జిల్లాల విభజన తర్వాత విస్తీర్ణం, జనాభా తగ్గడంవల్ల ప్రతీ కలెక్టర్ పరిధిలో రెండునుంచి నాలుగు లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నాయన్నారు. దీనివల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతీ ఒక్కరికీ అందేలా చూడటానికి అవకాశం ఏర్పడిందన్నారు. అలాగే అక్రమాలు, అవినీతి, జాప్యాన్ని నివారించి పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందించడం సాధ్యమవుతుందని సిఎం అన్నారు. కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా వెళ్లినవారంతా యువకులు, ఉత్సాహవంతులు కావడంవల్ల, వారిలో సేవ చేయాలన్న తపన ఉందన్నారు. వీరంతా పద్ధతి ప్రకారం ఒకే స్ఫూర్తితో పనిచేస్తే రాష్ట్రంలో అద్భుతాలు సాధించవచ్చన్నారు. ప్రజలు కూడా మార్పు గమనించి ప్రయోజనం పొందుతారన్నారు. ఉన్నతస్థాయి అధికారులు గతంలో కలెక్టర్లుగా పనిచేసిన అనుభవంతో యువ అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలివ్వాలని సూచించారు. మార్పు తీసుకురావడంలో కలెక్టర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించాలన్నారు. జిల్లాల పరిధిలో ఏశాఖ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా వాటిని కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. కొత్త పరిపాలనా విభాగాలతో పనిభారం తగ్గడం వల్ల పనితీరులో మరింత ప్రభావం, సమర్ధత కనిపించాలని సిఎం కోరారు. ప్రజలు మార్పు ప్రభావాన్ని చూడాలన్నారు. మంచి పాలన అందాలని, అవినీతి రుగ్మత పోవాలన్నారు. డబ్బులివ్వకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరుగవన్న భావన పోవాలన్నారు. మ్యుటేషన్లు, పహాణీ నకళ్లు, సర్ట్ఫికేట్లు సకాలంలో అందజేయాలన్నారు. రెవిన్యూ, మున్సిపాలిటీ, సర్వే విభాగాల్లో లంచం ఇవ్వకుండా పని జరిగినప్పుడు ప్రజలకు అవినీతిరహిత పాలన అందినట్టేనని సిఎం అన్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమైన వెంటనే రైతులకు అందాలని, కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి పోవాలన్నారు. గ్రామాలనుంచి గుడుంబా మహమ్మారి పారిపోవాలి. ప్రజలకు విద్య, వైద్యరంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ఎక్కువమంది ఆధారపడే వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అదించేందుకు ముందుగా ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించే దిశగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ విషయంలో తాను దత్తత తీసుకున్న ఎర్రవెల్లి, నర్సన్నపేటలో అందరికోసం అందరం అనే దృక్పథంతో సామూహిక వ్యవసాయం జరుగుతుందని, వీటిని ఇతర గ్రామాలకు ఆదర్శంగా తయారు చేస్తున్నామన్నారు.

చిత్రం.. ఉన్నతాధికారులు, కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్