రాష్ట్రీయం

కటాఫ్ ఏరియాలో ఏం జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/పాడేరు, అక్టోబర్ 24: అది కొండ లోయలతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతం.. కటాఫ్ ఏరియా.. మావోయిస్ట్‌లు తలదాచుకునే అత్యంత సురక్షిత ప్రదేశం. మావోయిస్ట్ అగ్ర నేతలు వచ్చినప్పుడు ఈ ప్రదేశంలోనే సమావేశాలు నిర్వహిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్ర, ఒడిశా మావోయిస్ట్‌లకు ఈ ప్రాంతం ఒక అడ్డా. ఇటువంటి అభేద్యమైన ప్రదేశంలోకి గ్రేహౌండ్స్ దళాలు ఎలా చేరుకోగలిగాయి? వారికి ఎవరు సమాచారం అందించి ఉంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా ముంచింగిపుట్, మల్కన్‌గిరి జిల్లాలోని కోరాపుట్ సరిహద్దు ప్రాంతమిది. ఈ ప్రాంతానికి వెళ్లటానికి రెండు దారులున్నాయి. పాడేరు నుంచి సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే ముంచింగిపుట్ వస్తుంది. అక్కడ నుంచి 15 కిలోమీటర్లు వెళితే బూసిపుట్టు వస్తుంది. ఇక్కడి వరకూ ద్విచక్ర వాహనాలు మాత్రమే నడుస్తాయి. అక్కడి నుంచి సుమారు 10 నుంచి 12 కిలోమీటర్లు కాలి నడకన వెళితే సోమవారం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి చేరుకోగలుగుతాం. మరోపక్క సీలేరు నుంచి 20 కిలోమీటర్లు వెళితే బలిమెల రిజర్వాయర్‌కు చేరుకుంటాం. అక్కడ నుంచి లాంచి లేదా బోట్‌లో 39 కిలోమీటర్లు ప్రయాణిస్తే ముంచింగిపుట్, కొరాపుట్ సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటాం. అక్కడి నుంచి ఐదు నుంచి ఏడు కిలో మీటర్లు కేవలం కాలి నడకన వెళితే ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి చేరుకుంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే కటాఫ్ ఏరియాకు చేరుకోవాలంటే అతి భయంకరమైన సాహసాలు చేయాల్సిందే. పోలీసులకు దుర్గమమైన ఈ ప్రదేశం చాలాకాలంగా మావోయిస్ట్‌లకు సురక్షిత ప్రదేశం. కానీ మావోల అడ్డాలోకి పోలీసులు అడుగుపెట్టారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 24మందిని మట్టుపెట్టారు.ఒకనాడు ఈ ప్రాంతంలో గిరిజనులకు వౌలిక వసతులు కల్పించడానికి మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణ ప్రయత్నిస్తే మావోయిస్ట్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి గణేష్ అతణ్ణి కిడ్నాప్ చేసి 20 రోజులు ఇదే కటాఫ్ ఏరియాలో బందీ చేశారు. కేంద్రం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్టర్‌ను విడిపించేందుకు నానా అవస్థలు పడాల్సివచ్చింది. ఇంత సురక్షిత స్థావరంగా ఉన్న కటాఫ్ ఏరియాలోకి పోలీసులు ఎలా ప్రవేశించారన్నది అందరి ముందున్న ప్రశ్న. పోలీస్ ఇన్‌ఫార్మర్లకు కూడా ఈ కటాఫ్ ఏరియాలోకి వెళ్లే మార్గాలు తెలియవు. మావోయిస్ట్‌ల్లో ఎవరో ఒకరు పోలీసులకు సహకరించకుండా అక్కడికి వెళ్లడం కష్టమే. పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు అక్కిడికి చేరుకున్నట్టు తెలుస్తోంది.
రెండు, మూడు నెలల కిందటే పోలీసులు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఒక మోస్తరు క్యాడర్‌లో ఉన్న మావోయిస్ట్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క గాలేరు-నగరిలో పనిచేస్తున్న కూలీలుగా పనిచేస్తున్న కొంతమంది మావోయిస్ట్‌లను కూడా పోలీసులు తమ అధీనంలో ఉంచుకున్నారు. వీరి ద్వారా సమాచారం సేకరించి కటాఫ్ ఏరియాకు చేరుకున్నారు. కటాఫ్ ఏరియాలో వ్యూహాత్మకంగా సురక్షిత ప్రాంతాలను ఎంచుకుని మరీ మావోయిస్టులను అన్ని వైపుల నుంచీ చుట్టు ముట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్ట్‌లు తేరుకుని తుపాకులు ఎక్కుపెట్టేలోగానే గ్రేహౌండ్స్ బలగాలు పని పూర్తిచేసేశాయి. మావోలు తప్పించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.