రాష్ట్రీయం

మృతదేహాలు భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను ఇరు రాష్ట్రాలకు తరలించినట్టయితే గురువారం వరకూ భద్రపరచాలని పోలీసులను ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎ శంకర్ నారాయణలతో కూడిన డివిజన్ బెంచ్ ఎపి సివిల్ లిబర్టీస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సి చంద్రశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎన్‌కౌంటర్‌పై తమకు అనుమానాలున్నాయని, దీనిపై విచారణ జరపాలని పౌరహక్కుల సంఘం కోరింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఐపిసి 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. మావోయిస్టులను అరెస్టు చేసే వీలున్నా ఎన్‌కౌంటర్ చేశారని, మృతదేహాలకు పోస్టుమార్టం కూడా సక్రమంగా చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వి రఘునాధ్ పేర్కొన్నారు. మృతదేహాలను విశాఖ కెజిహెచ్‌కు తరలించాలంటూ ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. కాగా ఎన్‌కౌంటర్‌లో ఎంతమంది చనిపోయారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఎపి ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఆపరేషన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని కోర్టుకు విన్నవించారు.