రాష్ట్రీయం

ఎన్‌కౌంటర్ బూటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: సిపిఐ మావోయిస్టు చర్చల ప్రతినిధి సహా మొత్తం 2ఆ మందిని ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లోని మల్కాన్‌గిరి ప్రాంతం జంత్రి అడవుల్లో సోమవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ పేరుతో హతమార్చడాన్ని విరసం నేత వరవరరావు, సిపిఐ (ఎంఎల్) ప్రతిఘటన, సిపిఐ (ఎంఎల్) రాంచంద్రన్, ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించాయి. మావోయిస్టులను హతమార్చి ఎన్‌కౌంటర్ అనడం సమంజసం కాదని, రాష్ట్ర విభజన తరువాత మావోయిస్టులు ఎక్కడైనా దాడులకు పాల్పడలేదని, అలాంటప్పుడు ఎన్‌కౌంటర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని విరసం నేత వరవరరావు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్‌కౌంటర్‌ను హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, మృతదేహాలను విశాఖ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. ఏకపక్ష కాల్పులకు తెగబడి అత్యంత అమానుషంగా 24 మందిని హత్య చేశారని సిపిఐ (ఎంఎల్) రాంచంద్రన్ అధికార ప్రతినిధి బుద్దా సత్యనారాయణ, సిపిఐ (ఎంఎల్) ప్రతిఘటన అధికార ప్రతినిధి షేక్ షావలి వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవకారులపై, విప్లవోద్యమాలపై జరుపుతున్న దాడులను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.