రాష్ట్రీయం

ఆర్‌కె వదిలిన బాణం..గాజర్ల రవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం/వరంగల్, అక్టోబర్ 24: పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టు పార్టీ దాకా అప్పగించిన అన్ని బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి కేంద్ర కమిటీ సభ్యుని స్థాయికి ఎదిగిన బలమైన నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్. ఆయన సోమవారం ఎఒబిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఆయన మృతితో ఒకరకంగా గ్రేహౌండ్స్‌లో విజయగర్వం తొణికిసలాడుతుందనడంలో సందేహం లేదు. వరంగల్ జిల్లా చిట్యాల పోలీస్టేషన్ పరిధిలోని వెలిశాల గ్రామానికి చెందిన ఆయన వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో పీపుల్స్‌వార్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించాడు. 1997లో పీపుల్స్‌వార్ కమాండర్‌గా ఆయన హయాంలోనే జనవరి 9న పినపాక మండలం కరకగూడెం పోలీస్టేషన్‌ను పేల్చివేశారు. ఈ ఘటనలో 16మంది పోలీసులు కూడా చనిపోయారు. వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో ఉంటూనే ఆయన దండకారణ్యానికి వెళ్లాడు. పార్టీ విస్తరణ, బలోపేతం చేయడంలో భాగంగా అక్కడి నుంచి ఎఒబిలో కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చాడు. 2008లో జూన్ 30న గ్రేహౌండ్స్ బలగాలు ఎఒబిలోని బలిమెల వద్ద సీలేరులో లాంచీలో ప్రయాణిస్తుండగా మావోయిస్టులు రాకెట్ లాంచర్లు, గ్రనేడ్లతో దాడి చేసి 37 మందిని హతమార్చిన సంఘటన తెలిసిందే. నాడు గ్రేహౌండ్స్ జవాన్లు 37 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ మెరుపు దాడికి వ్యూహకర్త రామకృష్ణ అయితే, చేసి చూపించింది గాజర్ల రవి. రామకృష్ణ తప్పించుకోగా గాజర్ల రవి చనిపోయాడు. బలిమెల ఘటన జరిగి ఎనిమిదేళ్లు గడిచాక ఇప్పుడు గ్రేహౌండ్స్ బలగాలు నెత్తుటి బాకీని తీర్చుకున్నాయని భావిస్తున్నారు.
వెలిశాలలో విషాదం
చిట్యాల: గాజర్ల రవి అలియాస్ గణేశ్ మావోయిస్టు పార్టీలో కీలక నేతగా మూడు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేస్తు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో రెండు మండలాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల కట్టమ్మ మల్లయ్య దంపతులకు 5గురు సంతానం. కాగా 4వ సంతానంగా గణేశ్ జన్మించాడు. పెద్దకుమారుడు రాజయ్య ఆనారోగ్యంతో మృతి చెందగా రెండవ కుమారుడు సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడో కుమారుడు సారయ్య అలియాస్ భాస్కర్ అలియాస్ అజాద్ మావోయిస్టు పార్టీలో పని చేస్తూ 2008 ఏప్రిల్ 2వ తేదిన ఏటూరునాగారం మండలం కంతనపల్లిలో జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. అయిదో కుమారుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ మావోయిస్టు పార్టీలో పని చేస్తూ ఆనారోగ్యంతో ఆర్నెల్ల క్రితం పోలీసులకు లొంగి పోయాడు.

గణేశ్ (ఫైల్ ఫొటో)