రాష్ట్రీయం

గ్రేహౌండ్స్ కమాండో అబూబకర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (గాజువాక), అక్టోబర్ 24: ధైర్య సాహసాలున్న ఒక రక్షక భటుణ్ని పోలీస్‌శాఖ కోల్పోయింది. ఎఒబి సరిహద్దుల్లో సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నక్సల్స్ తుపాకీ తూటాకు విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని అజీమాబాద్‌కు చెందిన మహ్మద్ అబూబకర్ (24) మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని డిజిపి సాంబశివరావు, డిఐజి శ్రీకాంత్, గ్రేహౌండ్స్ డిఐజి సురేంద్రబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వేర్వేరుగా పరామర్శించారు. అవివాహితుడైన బకర్ తల్లిదండ్రులు మహ్మద్ మదీనావల్లీ, ఉన్నిసా, సోదరి షబీర్‌ను ఓదార్చారు. బకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 11వ బెటాలియన్‌లో అబూబకర్ సీనియర్ కమాడెంట్‌గా పని చేసేవారని, విధి నిర్వహణలో చురుకైన పాత్ర పోషించే వారని డిజిపి ఈ సందర్భంగా అన్నారు. బకర్ గ్రేహౌండ్స్ ప్రత్యేక విభాగంలో కానిస్టేబుల్‌గా 2011లో విధుల్లో చేరినట్లు ఆయన తెలిపారు. వీర మరణం పొందిన అబూబకర్ కుటుంబానికి 40 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు.
గాయపడిన కమాండో సతీష్‌కు డిజిపి పరామర్శ
ఎన్‌కౌంటర్‌లో గాయపడి విశాఖలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సతీష్‌ను డిజిపి సాంబశివరావు పరామర్శించారు. మెరుగైన చికిత్సకు ఆదేశించారు.

చిత్రం.. కెజిహెచ్ వద్ద అబూబకర్ మృతదేహాన్ని
పోస్టుమార్టంకు తరలిస్తున్న దృశ్యం