రాష్ట్రీయం

విధిలేని పరిస్థితుల్లోనే ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 24: ‘‘ఏఓబిలో ఎదురు కాల్పులు జరిగాయి. గత కొద్ది రోజులుగా ఆంధ్ర, ఒడిశా పోలీసులు జాయింట్ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. వారిని లొంగిపోవలసిందిగా పోలీసులు మైకులో హెచ్చరించారు. కానీ మావోయిస్ట్‌లు కాల్పులు ప్రారంభించారు. విధిలేని పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది’’ అని డిజిపి సాంబశివరావు తెలియచేశారు. ఏఓబిలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళుతూ మార్గమధ్యంలో విశాఖ విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడారు. మావోయిస్ట్‌ల హేయమైన చర్యల వలన వారిని అదుపులోకి తీసుకోవడం, కాల్పులు జరిపితే, ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరుపుతున్నామని చెప్పారు. గాయపడిన మావోయిస్ట్‌లకు పోలీసులు రక్తదానం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయని డిజిపి సాంబశివరావు వెల్లడించారు.
11 మృతదేహాలను
గుర్తించాం: ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ
ఇదిలా ఉండగా విశాఖ జిల్లా ఎస్పీ సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారిలో 11 మందిని గుర్తించామని చెప్పారు. ఇందులో ఇద్దరు అగ్రనేతలు ఉన్నారని ఆయన తెలియచేశారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని ఆయన తెలియచేశారు. ఆపరేషన్‌కు ఎన్ని పోలీస్ బలగాలు వెళ్లాయని విలేఖరులు ప్రశ్నించగా, వారంతా తిరిగి వచ్చిన తరువాత ఆ వివరాలు చెపుతామని అన్నారు.

చిత్రం.. గాజువాకలో విలేఖరులతో మాట్లాడుతున్న డిజిపి సాంబశివరావు