రాష్ట్రీయం

తలాక్‌పై పునరాలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: ‘ట్రిపుల్ తలాఖ్‌పై ముస్లింలు ఆలోచన చేయాలి’ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారత సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) సురేష్ జోషీ (్భయ్యాజీ జోషి) హితవు చెప్పారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాలు మంగళవారం ముగిసాయి. భయ్యాజీ జోషి సమావేశాల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ప్రముఖ్ మన్మోహన్ వైద్య, సహ ప్రచార ప్రముఖ్ నందకుమార్ పాల్గొన్నారు. ట్రిపుల్ తలాఖ్‌పై అడిగిన ప్రశ్నకు భయ్యాజీ ప్రతిస్పందిస్తూ దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్పృతి ఉండాలన్నది తమ అభిమతమన్నారు. ట్రిపుల్ తలాఖ్ వల్ల అనేకమంది ముస్లిం మహిళల జీవితాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది ముస్లిం సమాజం వ్యక్తిగతమైనా, మానవీయ థక్పథంతో ఆలోచన చేయాలన్నారు. ట్రిపుల్ తలాఖ్‌పై ముస్లిం మహిళలు ఇదివరకే న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, వారికి న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లా కమిషన్ సైతం ప్రజాభిప్రాయాన్ని చేపట్టిందన్నారు. లింగ వివక్ష ఉండరాదని ఆయన అన్నారు.
సాయిబాబాపై స్వామి స్వరూపానంద చేసిన వివాదస్పద వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, సమాజంలో ప్రతి మానవుడినీ దేవునిలా చూస్తామని, ప్రతి ప్రాణిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి సాయి కూడా దేవుడేనని సమాధానమిచ్చారు. సాయిబాబాను దేవునిలా విశ్వసించాలా? లేదా? అనేది భక్తులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనిపై చర్చ అవసరం లేదన్నారు. సమాజంలో కుల వివక్ష వంటి రుగ్మతలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలన పని తీరు ఎలా ఉందని ప్రశ్నించగా, సమాజంలోని అన్ని విషయాలతోపాటు కేంద్ర ప్రభుత్వ పాలనపైనా సమీక్షించామని, అవసరమైనప్పుడు తమ అభిప్రాయాలను తెలియజేస్తుంటామని అన్నారు. అయితే ప్రభుత్వమే ఆత్మవలోకనం చేసుకోవాలని, ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని సమీక్షించుకోవాలని సూచించారు. సమావేశాలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమీత్ షా కూడా హాజరైనందున ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల గురించి చర్చించారా? ఏమైనా సలహాలిచ్చారా? అన్న ప్రశ్నకు, ఎన్నికల గురించి బిజెపి ఆలోచన చేస్తుందే తప్ప ఆర్‌ఎస్‌ఎస్ కాదని దాటవేశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగాలన్నది దేశంలోని ప్రతి హిందువూ కోరుకుంటున్నారని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే దీనిపై కోర్టులో కేసులు ఉన్నందున అవి పరిష్కారం కావాల్సి ఉందన్నారు. ఇది 30 ఏళ్ళుగా నానుతున్న అంశమన్నారు. పాక్ దాడులకు ప్రతీకారంగా నిర్వహించిన ‘సర్జికల్ స్ట్రైక్’ గురించి ప్రశ్నించగా, దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, తదనుగుణంగా మన దేశ సైన్యం గట్టి జవాబు చెప్పడం జరిగిందన్నారు. మన దేశ సైన్యం చర్యను ప్రతి ఒక్కరూ అభినందించాలని అన్నారు. ఆంతరంగిక భద్రత విషయంలో మన సైన్యం అప్రమత్తంగా ఉందన్నారు. పాకిస్తాన్‌లోనూ ఉగ్రవాదుల చర్యల కారణంగా అమాయకులు బలవుతున్నారని భయ్యాజీ చెప్పారు. దీనిపై ఆ దేశ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలన్నారు.
స్వదేశీ వస్తువులే వాడండి
మన దేశంలో చైనా ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపి వేయాలా? అని ప్రశ్నించగా, చైనా ఒక్కటే కాదు విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులనే వాడాలని ఆర్‌ఎస్‌ఎస్ ఆనాటి నుంచీ చెబుతున్నదని గుర్తు చేశారు. గోరక్ష గురించి తాము ఆందోళన చేస్తున్నామన్నారు. దీనికి పోలీసులూ రక్షణ కల్పించాలని ఆయన కోరారు. కమ్యూనిస్టుల ఆగడాలు పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ప్రశాంతంగా ఉండే కర్నాటకలోనూ పెరుగుతున్నాయని విమర్శించారు. కాబట్టి కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలని, స్వయం సేవకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల మధ్య మైనారిటీ, మెజారిటీ అనే విభేధాలు తేరాదని కోరారు. కళాకారుల విషయంలో కుల, మత, దేశ బేధ భావాలు ఉండరాదని, అయితే మన దేశంలో సినీ కళాకారులకు కొరత లేదని ఆయన పాక్ నటుల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల భయ్యాజీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్వచ్చ భారత్ పిలుపుతో ప్రతి ఒక్కరిలోనూ కదలిక వచ్చిందని, దీన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. సంఘ్ విస్తరణపై చర్చించినట్టు తెలిపారు. దేశంలో 27 లక్షలమంది స్వయం సేవకులున్నట్టు భయ్యాజీ చెప్పారు.

చిత్రం... ఆర్‌ఎస్‌ఎస్ కీలక సమావేశాల వివరాలను మీడియాకు
వెల్లడిస్తున్న అఖిల భారత సర్ కార్యవాహ సురేష్ జోషీ