రాష్ట్రీయం

మోదీ పాలన భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నెల 19న ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యకారిణి సమావేశాలు మంగళవారంతో ముగిసాయి. 22వ తేదీ నుంచే కీలకమైన భేటీ జరిగింది. దేశ వ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్ శాఖలను విస్తరణ, హిందుత్వ, దేశ సంస్కృతి సంప్రదాయాల రక్షణ, ఉమ్మడి పౌరస్మృతి, కమ్యూనిస్టుల ఆగడాలు, దేశ అంతర్గత భద్రత వంటి అనేకానేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్‌జీ భాగవత్, సహ కార్యవాహ సురేష్ జోషీజీ (్భయ్యాజీ జోషి), ప్రచార్ ప్రముఖ్ డాక్టర్ మన్మోహన్ వైద్య, విహెచ్‌పి నేత ప్రవీణ్‌భాయి తొగాడియా, ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న బిఎంఎస్, బికెఎస్ వంటి పలు సంస్థల ప్రతినిధులూ మొత్తం 500 మంది వరకు పాల్గొన్నారు. చివరి రెండు రోజులు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సాధారణ స్వయం సేవకునిలా అందరితో పాటు కూర్చున్నారు. బిజెపి నాయకులు రాంలాల్, రాంమాధవ్ ప్రభృతులు హాజరయ్యారు. ప్రధాని మోదీ పాలన పట్ల సమావేశం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అవసరమైనప్పుడు తగు సలహాలు, సూచనలు చేయాలని భావించారు.
నగర శివారులోని ఘట్‌కేసర్, అన్నోజిగుడాలోని శ్రీవిద్యావిహార్ పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశాల్లో ప్రజల్లోకి జాతీయవాదం, హిందూ జీవన మూలాలు తీసుకెళ్ళాలని స్వయంసేవకులకు మోహన్ జీ భాగవత్ పిలుపునిచ్చారు. రాబోయే తొమ్మిదేళ్ళలో దేశ వ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్ శాఖల సంఖ్యను లక్షకు పెంచాలన్న లక్ష్యంగా పెట్టుకున్నది. 2025లో నిర్వహించబోయే ఆర్‌ఎస్‌ఎస్ శత వసంతాల ఉత్సవం నాటికి లక్ష్యానికి చేరుకోవాలని భావించింది. స్వయం సేవకులపై కమ్యూనిస్టుల దాడులను ఖండిస్తూ తీర్మానం చేయడంతో పాటు, జాతీయవాదాన్ని పెంపొందించడం వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
శాఖల విస్తరణ ద్వారా జాతీయవాదం పెంపొందుతుందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గోసేవ, కుటుంబ జీవనం, సామాజిక సమరసత, గ్రామ వికాస్, ధర్మ జాగరణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకునే బాధ్యతను స్వయం సేవకులే చేపట్టాలని నిర్ణయించారు. సంఘ్ కీలక నాయకులు, బిజెపి అగ్రనేతలు పెద్ద సంఖ్యలో హాజరు కావటంతో అన్నోజీగూడ ప్రాంగణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యకారిణి
సమావేశాలకు మంగళవారం తరలివస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్
మోహన్‌జీ భాగవత్, ప్రచార్ ప్రముఖ్ డాక్టర్ మన్మోహన్ వైద్య.