రాష్ట్రీయం

యుఎస్ కాన్సులేట్‌లకు కొత్త వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: అమెరికా రాయబార కార్యాలయాలతో పాటు భారతదేశంలోని కాన్సులేట్ కార్యాలయాల వెబ్ పోర్టల్ చిరునామాను మంగళవారం నాడు మార్చింది. ఈ మేరకు కాన్సులేట్ సలహాదారు మహ్మద్ అబ్దుల్ బాసిత్ ఒక ప్రకటన చేశారు. తాజా నిర్ణయంతో చెన్నై, కొల్‌కతా, హైదరాబాద్, ముంబై కాన్సులేట్ వెబ్ చిరునామాలు మారుతాయి. ఇన్ డాట్ యుఎస్ ఎంబసీ డాట్ జీవోవీ పేరుతో పోర్టల్ వెబ్ చిరునామాను ఏర్పాటు చేశారు. వర్డుప్రెస్ నమూనాలో ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల్లో ఈ పోర్టల్ ఇతర వెబ్, బ్లాగ్‌లు పనిచేసే రీతిలోనే పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త వెబ్‌పోర్టల్‌లో అనేక అంశాలపై సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచామని చెప్పారు. యుఎస్ వీసా, జాబ్ వెకెన్సీ ప్రకటనలు, అధికారిక ప్రకటనలు, అలాగే భారత్‌లోని అమెరికన్ సిటిజన్లు కోసం పాస్‌పోర్టు వివరాలు, వ్యాపారుల కోసం డూయింగ్ బిజినెస్ లింక్‌లు, అమెరికాలో చదువులు ఇతర వివరాలను ఉంచామని అన్నారు. మారిన పోర్టల్ చిరునామాతో ఇక మీదట సెల్‌ఫోన్లలోనూ ఇతర రూపాల్లో కూడా పోర్టల్‌ను తేలికగా అనే్వషించవచ్చని చెప్పారు. అమెరికా పౌరుల సేవలు, ఉద్యోగ ప్రకటనలు, అమెరికా విధానాలు, వార్తలు, సంఘటనలు ఇతర అంశాలను ఉంచామని అన్నారు. అలాగే ఫేస్‌బుక్, ట్విట్టర్, ఫ్లిక్కర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో కూడా సందర్శించవచ్చని తెలిపారు.