రాష్ట్రీయం

మాస్ కాపీయింగ్ నిరోధానికి ఏం చేస్తున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: పదవ తరగతి పరీక్షలు, ఇతర పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన వారిని ఎందుకు ప్రాసిక్యూషన్ చేయలేదని హైకోర్టు రెండు రాష్ట్రప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ప్రశ్నించింది. పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణ ఈ కేసును విచారించారు. ఏలూరుకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ గుంటుపల్లి ఈ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రాష్ట్రప్రభుత్వాలు పబ్లిక్ పరీక్షలు, ఇతర పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పరీక్షలు 1997 చట్టం కింద నమోదు చేసిన కేసులు, వాటి వివరాలను తెలియచేయాలని, అఫిడవిట్లనుదాఖలు చేయాలని హైకోర్టు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. కరీంనగర్ జిల్లా మల్లాపూర్‌లో పాఠశాలలో వంద శాతం ఫలితాలు విద్యార్థులు సాధించారని, అదే సిసి కెమెరాలు అమర్చిన తర్వాత ఈ పాఠశాలలో 40 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారని పిటిషనర్ ఉదహరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ పబ్లిక్ పరీక్షలు జరిగే అన్ని పాఠశాలల్లో సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏపి ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మాస్ కాపీయింగ్ నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం ఈ కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.