తెలంగాణ

రెచ్చిపోతున్న లాండ్ మాఫియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/బేగంపేట, డిసెంబర్ 27: రాజధాని నగరంలో ల్యాండ్ మాఫియా విజృంభిస్తోంది. భూ తగాదాలు, ఆక్రమణలు, సెటిల్‌మెంట్ పేర్లతో ల్యాండ్ మాఫియా నగర శివారులతో పాటు రాజధానిని వణికిస్తోంది. గత రెండు నెలల వ్యవధిలోనే నాలుగు హత్యలు జరిగాయి. తాజాగా శనివారం రాత్రి జరిగిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యతో నగరం ఉలిక్కిపడింది. బేగంపేటలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన వివరాల్లోకి వెళితే..బేగంపేట పరిధిలోని షేర్‌ఖాన్ బస్తీకి చెందిన రియాజ్ ఖాన్ (38) రియల్ ఎస్టేట్ వ్యాపారి. గత కొంతకాలంగా రెండున్న ఎకరాల ఓ స్థల వివాదంలో అదే ప్రాంతానికి చెందిన మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి షరీఫ్‌తో మనస్పర్థలున్నాయి. ప్రకాష్‌నగర్‌లోని సర్వే నం. 28లో, 194/ఏ లోగల స్థలంపై కేసు కోర్టులో నడుస్తుండగా కోర్టులో రియాజ్ ఖాన్‌కు అనుకూలంగా తీర్పు రానుందని తెలిసి ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు శనివారం రాత్రి ప్రకాష్‌నగర్‌లో ఉన్న రియాజ్ ఖాన్‌ను అతి దారుణంగా హత్య చేశారు. కాగా పదిహేను రోజుల క్రితమే వ్యాపారి రియాజ్ ఖాన్ నగర కమిషనర్‌ను కలసి తనకు కొందరి వల్ల ప్రాణ హాని ఉందని, భద్రత కల్పించాలని కోరాడు. దీంతో కమిషనర్ నార్త్‌జోన్ డిసిపికి భద్రత కల్పించాల్సిందిగా ఆదేశించారు. సదరు డిసిపి స్థానిక ఎసిపి, సిఐలను భద్రత విషయమై ఆదేశించారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని రియాజ్ ఖాన్ సోదరుడు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తన సోదరుడి హత్య కేసులో లొంగిపోయిన దౌలత్ ఖాన్, ఎంపి అజర్‌ఖాన్, ఎండి ఖాద్రి హంతకులు కాదని, ఈ హత్యకు అసలు సూత్రధారులు షరీఫ్ ఖాన్, ఇమ్రాన్, సాదిఖ్‌లని హతుడి సోదరుడి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. నార్త్‌జోన్ డిసిపి ప్రకాష్‌రెడ్డి, ఎసిపి గణేష్‌రెడ్డి, సిఐ బస్వారెడ్డి సంఘనా స్థలానికి చేరుకొని హత్యోదంతంపై విచారణ చేపట్టారు. సెక్షన్ 304కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సిఐ తెలిపారు.