రాష్ట్రీయం

తెలుగులోనూ ‘నీట్’ పరీక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: మెడికల్, డెంటల్ కాలేజీల్లో యుజి కోర్సుల్లో అడ్మిషన్లకు దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్)లో ప్రశ్నాపత్రాలను కనీసం ఆరు ప్రాంతీయ భాషల్లోనూ ఇవ్వాలని సిబిఎస్‌ఇ యోచిస్తోంది. ఇంత వరకూ నీట్ పరీక్ష ఆంగ్లంలో మాత్రమే జరిగేది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లో ప్రాంతీయ మాధ్యమాల్లో చదివే విద్యార్థులకు అవకాశాలు సన్నగిల్లరాదనే భావనతో ప్రాంతీయ భాషల్లోనూ ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని వివిధ రాష్ట్రాలు చేసిన సూచనను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే తమిళం, తెలుగు, మరాఠీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతి భాషల్లో ప్రశ్నాపత్రాలు ఇస్తారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకుని ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాషల్లో ప్రశ్నాపత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు నడుస్తోంది. ఆంగ్ల భాషలోని ప్రశ్నాపత్రాన్ని వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించి దానిని ముద్రించి ఆయా రాష్ట్రాలకు పంపించడంలో ఉన్న ఇబ్బందులను సిబిఎస్‌ఇ సమీక్షిస్తోంది.