రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలు సులభ వాణిజ్యానికి నెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: సులభంగా వ్యాపారం, వాణిజ్యం చేసుకునేందుకు తేలికగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు చేరాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారం రానుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సులభంగా వ్యాపారం, వాణిజ్యం చేసుకునేందుకు ఉన్న పరిస్థితులపై ప్రపంచబ్యాంకు తమ గ్రేడింగ్‌లతో కూడిన నివేదికను బుధవారం విడుదల చేసింది. కేంద్రప్రభుత్వం త్వరలో విడుదల చేసే రాష్ట్రాల వారీ సూచికల్లో ఈ రెండు రాష్ట్రాలు దాదాపు 99.09 స్కోర్‌ను సాధించాయి. నిర్మాణ అనుమతుల విభాగంలో తెలంగాణ ప్రత్యేక ప్రశంసలు పొందింది. నిరభ్యంతర పత్రం స్థానంలో స్వీయ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుందంటూ నిబంధనలను సరళీకృతం చేయడంతో రెండు రాష్ట్రాలు ర్యాంకింగ్‌లో ఎగబాకాయి. ఏకంగా ఆంధ్రప్రదేశ్ (99.09) ప్రథమస్థానంలో ఉండగా, తెలంగాణ (99.09) తర్వాతి స్థానంలో ఉంది. గుజరాత్ (97.92) మూడోస్థానానికి దిగజారింది. రాజస్థాన్ (97.32), మధ్యప్రదేశ్ (97.01), హర్యానా (96.95) , చత్తీస్‌ఘ్ఢ్(96.73), జార్ఖండ్(96.57), ఉత్తరాఖండ్(96.13), ఒడిశా(93.03), మహారాష్ట్ర(92.26), పంజాబ్(91.07) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేంద్రప్రభుత్వం గత అక్టోబర్‌లో 337 అంశాలతో వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను పంపించింది. ప్రధానంగా నిర్మాణ అనుమతులు, పర్యావరణ అనుమతులు, కార్మిక చట్టాలు, విద్యుత్ కనెక్షన్లు మంజూరు, ఆన్‌లైన్‌లో పన్నుల చెల్లింపులు, తనిఖీ సంస్కరణలు, సమాచార అందుబాటు, పారదర్శకత, సింగిల్ విండో విధానం, భూమి సంబంధిత అంశాలు, వివాదాల పరిష్కార విధానాల అమలు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చింది. అందుకు 337 అంశాల్లో ఆయా రాష్ట్రాలు చేపట్టిన, కొనసాగిస్తున్న పద్ధతులు విధానాలను ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకునే వీలు కల్పించింది. ఆయా రాష్ట్రాలు అప్‌డేట్ చేసిన సమాచారం ఆధారంగా వాటి ర్యాంకు ఏ రోజుకారోజు మారిపోతుంది. పది రాష్ట్రాలు 90 శాతం అంతకన్నా ఎక్కువ స్కోర్ సాధించినట్టు తెలిసింది. కార్యాచరణ ప్రణాళికలో విద్యుత్ కనెక్షన్లు పొందడం, పర్యావరణం, కార్మిక రిజిస్ట్రేషన్, నిర్మాణ అనుమతి, ఆన్‌లైన్‌లో పన్నుల చెల్లింపు, తనిఖీల్లో సంస్కరణలు, భూమి , సమాచార లభ్యత, పారదర్శకత, వివాదాల పరిష్కారం వంటి అంశాలు ఉన్నాయి. ఎ విభాగం కింద గుర్తింపు పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, పంజాబ్ ఉన్నాయి. 60-90 శాతం అమలుతో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు బి గ్రేడ్ పొందాయి. మిగిలిన 19 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు 0-59 శాతం అమలుతో సి, డి విభాగంలో స్కోర్లు పొందాయి. కేరళ 24.92 శాతం, గోవా 18.22 శాతం, అసోం 14.35 శాతం, మణిపూర్ 1.47 శాతం స్కోర్లు పొందాయి. జమ్మూకాశ్మీర్ , చండీగఢ్, లక్షద్వీప్‌ల్లో ఈ సంస్కరణలు ఇంకా అమలులోకి రానేలేదు. కొన్ని రాష్ట్రాలు అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర రాష్ట్రాలు పాటించేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. విద్యుత్ కనెక్షన్లు మంజూరులో రాజస్థాన్ ఆన్‌లైన్ విధానం, స్థల లభ్యతపై జార్ఖండ్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం అమలుచేస్తున్నాయి.