రాష్ట్రీయం

తాను మరణించి ఐదుగురికి ప్రాణదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 27: తాను మరణించినా మరో ఐదుగురికి ప్రాణం పోసి వారిలో జీవిస్తున్నాడు కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన పుల్లయ్య. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్సపొందిన కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన బోయ పుల్లయ్య(34) గురువారం తెల్లవారుజామున బ్రెయిన్‌డెడ్‌కు గురవడంతో అతని అవయవాలను మరో ఐదుగురికి అమర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదడు సంబంధవ్యాధితో బాధపడుతూ 13 రోజుల క్రితం పుల్లయ్య హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు పుల్లయ్యకు చేసిన చికిత్స సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో గురువారం తెల్లవారుజామున బ్రెయిన్‌డెడ్‌గా నిర్ణయించి కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో అతడి అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్న కుటుంబసభ్యులు కిమ్స్ వైద్యులకు విషయం తెలిపారు. వెంటనే స్పందించిన వైద్యులు తక్షణం జీవన్‌దాన్ ట్రస్ట్‌కు సమాచారం పంపారు. ప్రభుత్వ వైద్యుల బృందం, జీవన్‌దాన్ ట్రస్ట్ ప్రతినిధులు కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని పుల్లయ్యకి జరిగిన చికిత్స విధానాన్ని పరిశీలించి అవయవాలను స్వీకరించేందుకు అంగీకరించారు. కళ్లు మినహా గుండె, కాలేయం, ఊపరితిత్తులు, మూత్రపిండాలను సేకరించారు. వెంటనే వాటిని హైదరాబాద్ నగరంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులకు ఉపయోగించేందుకు చకచకా ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజాము కావడం, భాగ్యనగరం రహదారులు నిర్మానుష్యంగా ఉండడంతో శరవేగంగా అవయవాలను ఆయా ఆసుపత్రులకు తరలించారు. ఐదుగురికి శస్తచ్రికిత్సలు విజయవంతంగా పూర్తయినట్లు తెలియడంతో తమ కుమారుడు మరణించినా మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడన్న సంతృప్తితో పుల్లయ్య తల్లిదండ్రులు, బంధుమిత్రులు అతడి మృతదేహాన్ని ఆత్మకూరుకు తీసుకువచ్చారు. విషయం తెలియగానే పట్టణ ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి పుల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పుల్లయ్య బాటలో ప్రతి ఒక్కరు అవయవదానానికి ముందుకు రావాలని వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.