రాష్ట్రీయం

మావోల మృతదేహాలకు అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు/ టంగుటూరు, అక్టోబర్ 27: మావోయిస్టు పార్టీ కీలక నేత అక్కిరాజు రామకృష్ణ తనయుడు పృథ్వి అలియాస్ మున్నా మృతదేహానికి గురువారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మున్నా మృతదేహాన్ని ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం నుండి బంధువులు గురువారం ఉదయం ఆలకూరపాడుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆర్‌కె సతీమణి, మున్నా తల్లి శిరీష విలేఖరులతో మాట్లాడుతూ తన కుమారుడు పృథ్వి మృతి బాధ కలిగించినా పీడిత ప్రజల కోసం ప్రాణాలు అర్పించటం గర్వంగా ఉందన్నారు. తన భర్త రామకృష్ణ లొంగిపోతే చికిత్స చేయిస్తామని ప్రభుత్వం చెప్పే మాటలు బూటకమని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లతో బెదిరించినంత మాత్రాన తన భర్త లొంగిపోరని ఆమె వెల్లడించారు. ఎన్‌కౌంటర్ ముమ్మాటికి బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆమె ధ్వజమెత్తారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులపై దొంగదెబ్బతీసి పొట్టన పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులు ఏ విధమైన ముందస్తు హెచ్చరికలు చేయకుండానే అందరినీ బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారని శిరీష విమర్శించారు. విరసం నేత, మున్నా బాబాయి జి కళ్యాణరావు విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజలతో సంబంధం లేని లోకేష్‌కు, డిజిపి సాంబశివరావుకు అదనపు భద్రత కల్పించుకోడానికే ముఖ్యమంత్రిబూటకపు లేఖలు ప్రచురించారని ధ్వజమెత్తారు.
బాకూరులో గణేష్‌కు నివాళి
హుకుంపేట: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు రాష్ట్ర నాయకుడు బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అంత్యక్రియలు గురువారం బాకూరులో కుటుంబ సభ్యులు, వందలాది మంది ప్రజల మధ్య నిర్వహించారు.
గణేష్ భార్య దమయంతి, సోదరుడు కృష్ణంరాజు, బొంజుబాబు తదితర కుటుంబ సభ్యులు గణేష్ మృతదేహాన్ని మల్కన్‌గిరి నుంచి బుధవారం రాత్రి స్వగ్రామమైన బాకూరుకు తీసుకువచ్చారు. అప్పటికే పూర్తిగా చీకటి పడిపోవడంతో అంత్యక్రియలను గురువారానికి వాయిదా వేశారు.ఆదివాసీ హక్కుల కోసం విద్యార్థి దశలోనే మావోయిస్టు ఉద్యమంలో చేరి ప్రజల కోసమే అహర్నిషలు పనిచేశారన్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న గణేష్ పోలీస్ తూటాలకు అన్యాయంగా బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలాసి కృష్ణారావు, చెండా ఏలియా, ప్రొఫెసర్ జర్రా అప్పారావు, డిఎల్‌ఒ నాయకులు రంజిత్‌కుమార్, వైకాపా నేత సురేష్, చిన్నప్పలనాయుడు గణేష్‌కు నివాళులు అర్పించారు.
పల్లంట్లలో ఇద్దరికి అంతిమ సంస్కారం
దేవరపల్లి: ఎఒబిలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలకు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్లలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతులు అయినపర్తి దాసు (మధు), గెడ్డం సువర్ణరాజు బావ, బావమరుదులు. వీరి స్వగ్రామం దేవరపల్లి మండలం పల్లంట్ల కావడంతో పోస్టుమార్టం పూర్తయిన వారి మృతదేహాలను ఇక్కడకు తరలించారు. ఎఐఎఫ్‌యు రాష్ట్ర నేత ఎస్‌కె మస్తాన్, రాష్ట్ర పౌరహక్కుల సంఘం నేత వేడంగి చిట్టిబాబు ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు.

చిత్రాలు..ఆలకూరపాడులో మున్నా అంతిమయాత్ర. బాకూరులో గణేష్‌కు నివాళి.